ఈ మధ్య కాలంలో చిన్న సినిమాల్లో అతి పెద్ద విజయం అంటే.. ‘బేబి’దే. పెద్దగా పేరు, ఇమేజ్ లేని హీరో హీరోయిన్లను పెట్టి ఒక సినిమా అనుభవమున్న సాయి రాజేష్ తీసిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర పెను సంచలనమే సృష్టించింది. రెండు వారాల్లో ఏకంగా రూ.70 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు కలెక్ట్ చేసి ట్రేడ్ పండితులను షాక్‌కు గురి చేసింది. ఐతే ఈ వారం పవన్ కళ్యాణ్ సినిమా ‘బ్రో’ థియేటర్లలోకి దిగడంతో ‘బేబి’కి ఇక కష్టమే అనుకున్నారు. ఇక్కడి నుంచి వసూళ్ల మీద ‘బేబి’ టీం పెద్దగా ఆశలు పెట్టుకోవాల్సిన పని లేదనే అభిప్రాయం వ్యక్తమైంది.
కానీ ‘బేబి’ టీం మాత్రం అలా ఆలోచించట్లేదు. ‘బ్రో’ ప్రభావం ‘బేబి’ మీద మరీ ఎక్కువ ఉండదని ‘బేబి’ ఆడియన్స్ ‘బేబి’కి ఉన్నారని.. ఈ సినిమా థియేట్రికల్ రన్ ఇంకో పది రోజులు కొనసాగుతుందని.. మంచి షేర్ వస్తుందని అంచనా వేస్తున్నారు. శుక్రవారం ‘బ్రో’ ఓవర్ ఫ్లోస్ ‘బేబి’కి కలిసి రావడంతో వారిలో జోష్ వచ్చింది.
వచ్చే వారం చెప్పుకోదగ్గ రిలీజ్‌లు లేకపోవడంతో ‘బ్రో’ తర్వాత ప్రేక్షకులకు సెకండ్ ఆప్షన్‌గా ‘బేబి’నే ఉంటుందని.. ఇండిపెండెన్స్ డే వీకెండ్ వరకు రన్ కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు. అన్నీ కలిసి వస్తే సినిమా రూ.100 కోట్ల క్లబ్బులోకి కూడా చేరుతుందని భావిస్తున్నారు. ఇదే లక్ష్యంగా ‘బేబి’ టీం డైరెక్టర్స్ కట్ అంటూ ఇంకో 14 నిమిషాల నిడివిని పెంచి కొత్త వెర్షన్‌ను థియేటర్లలోకి వదులుతోంది. ఇందులో అదనంగా ఒక పాటతో పాటు కొన్ని సన్నివేశాలు కూడా తోడవుతున్నాయి. దీని కోసం యూత్ మళ్లీ థియేటర్లకు వస్తారని భావిస్తున్నారు.
‘బేబి’కి ఆల్రెడీ యూత్ రిపీట్స్ వేస్తున్నారు. కొత్త ఆకర్షణ ఈ దిశగా మరింత మందిని థియేటర్లకు నడిపిస్తుందని భావిస్తున్నారు. దీనికి తోడు మెగాస్టార్ చిరంజీవి అతిథిగా ఇంకో ప్రమోషనల్ ఈవెంట్ కూడా ప్లాన్ చేస్తున్నారు. ఆ ప్రమోషన్ కూడా ప్లస్ అవుతుందని భావిస్తున్నారు. మొత్తంగా చిన్న చిత్రాల్లో అతి పెద్ద విజయంగా, అరుదైన వంద కోట్ల మార్కును అందుకున్న సినిమాగా ‘బేబి’ని నిలబెట్టడానికి గట్టి ప్రయత్నమే జరుగుతోంది.
This post was last modified on July 29, 2023 6:01 pm
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…