పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వింటేజ్ షో చూసి ఫ్యాన్స్ ఊగిపోతున్నారు కానీ సాధారణ ప్రేక్షకుల్లో మాత్రం దీని పట్ల మిశ్రమ స్పందనే వ్యక్తమవుతోంది. టాక్ డివైడ్ గా కొనసాగుతున్నా బాక్సాఫీస్ వద్ద వసూళ్లు భారీగా నమోదవుతున్నాయి. బెనిఫిట్ షోలు లేకపోవడం, సాధారణ టికెట్ రేట్లకే అమ్మకాలు చేయాలని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్ణయించుకోవడంతో ఆ ప్రభావం నేరుగా ఓపెనింగ్స్ మీద పడింది. తెల్లవారుఝామున 4 గంటలకు షో వేస్తే వెయ్యి దాకా అమ్ముడుపోయే టికెట్ అది కాస్తా 7 తర్వాత పడటంతో అయిదు వందలకు తగ్గిపోయింది. ఈ ఎఫెక్ట్ గ్రాస్ మీద పడింది.
దీని సంగతి ఎలా ఉన్నా బ్రో మొదటి రోజు 30 కోట్లకు పైగా షేర్ తో పవన్ బ్రాండ్ స్టామినాని మరోసారి రుజువు చేసింది. ఇదేమి కెరీర్ బెస్ట్ కాకపోయినా ఇంత ప్రతికూల వాతావరణంలో ఈ ఫిగర్ రావడమంటే చిన్న విషయం కాదు. గ్రాస్ 50 కోట్లకు చేరువలో ఉంది. బ్రేక్ ఈవెన్ కి బ్రో ఇంకా డెబ్భై శాతం దూరంలో ఉన్నాడు. నైజామ్ నుంచి అత్యధికంగా ఎనిమిదిన్నర కోట్ల షేర్ వసూలు కాగా సీడెడ్ లో రెండు కోట్ల డెబ్భై లక్షలతో కొంచెం నెమ్మదిగా ఉంది. ఓవర్సీస్ నుంచి నాలుగున్నర కోట్ల దాకా కలెక్షన్ వచ్చింది. కేవలం తెలుగు రాష్ట్రాలను పరిగణనలోకి తీసుకుంటే 24 కోట్లకు దగ్గరగా ఉంది.
బ్రోకున్న అతి పెద్ద సానుకూలాంశం వీకెండ్. బాక్సాఫీస్ వద్ద చెప్పుకోదగ్గ సినిమాలేవీ లేవు. హిందీ మూవీ రాకీ రాణి కి ప్రేమ్ కహానికి బ్లాక్ పర్వాలేదనే టాక్ తప్ప యునానిమస్ గా ఆహా ఓహో అనిపించుకోలేదు. అయితే హైదరాబాద్ లాంటి నగరాల్లో మాత్రం ఆక్యుపెన్సీలు బాగున్నాయి. బ్రో శని ఆదివారాల్లో ఇంకో ఇరవై కోట్లకు షేర్ రాబడితే అక్కడికి సగం టార్గెట్ పూర్తవుతుంది. వంద కోట్ల లక్ష్యం కాబట్టి అదంత సులభంగా ఉండదు. ఏపీలో రెగ్యులర్ రేట్లే అందుబాటులో ఉన్నా కుటుంబ ప్రేక్షకులు ఎక్కువగా వస్తే బ్రో పని సులభమవుతుంది. చూడాలి మరి.
This post was last modified on July 29, 2023 11:21 am
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…