Movie News

ఇచ్చిన మాట కోసం సలార్ పోరాటం

మోస్ట్ వాంటెడ్ ప్యాన్ ఇండియా మూవీస్ లో అగ్ర స్థానంలో ఉన్న సలార్ విడుదలకు ఇంకో రెండు నెలలు మాత్రమే టైం ఉంది. చూస్తుండగానే కాలం ఇట్టే కరిగిపోతుంది కాబట్టి బిజినెస్ వ్యవహారాలతో పాటు ఇతరత్రా కార్యక్రమాల కోసం హోంబాలే ఫిలింస్ ప్లానింగ్ రెడీ చేస్తోంది. బిజినెస్ ఊపందుకుంది. డిస్ట్రిబ్యూటర్లు ఇస్తున్న క్రేజీ ఆఫర్లను క్షుణ్ణంగా పరిశీలించి ట్రైలర్ వచ్చాక వాటిని ఫైనల్ చేసే ఆలోచనలో ఉన్నారు. ఇక సలార్ కథకు సంబంధించిన లీక్స్ ఒక్కొక్కటిగా బయటికి వస్తూ ఆసక్తిని పెంచుతున్నాయి. ముఖ్యంగా స్టోరీ లైన్ గురించిన చర్చే ఎక్కువగా ఉంది.

వాటి ప్రకారం సలార్ పాత్ర పోషించిన ప్రభాస్ తల్లికి, స్నేహితుడికి ఇచ్చిన వేర్వేరు మాట కోసం పెద్ద యుద్ధమే చేయాల్సి వస్తుంది. ఈ సంఘర్షణ వల్ల అతనికి కొత్త శత్రువులు ఏర్పడతారు. మాఫియా కబంధ హస్తాల్లో ఉన్న ఒక చీకటి ప్రపంచాన్ని తన చేతుల్లోకి తీసుకోవాలని ఆశపడిన ఒక రాజుకి బాహుబలి లాంటి సైనికుడు తోడైతే ఎలా ఉంటుందో ఆ ఆలోచనే సలార్ కు శ్రీకారం చుట్టేలా చేసిందని దర్శకుడు ప్రశాంత్ నీల్ తన సన్నితులతో అన్నారట. పృథ్విరాజ్ సుకుమారన్ పాత్ర ప్రభాస్ తో సమానంగా చాలా షాకింగ్ గా ఉంటుందని కూడా అంటున్నారు.

ఎమోషన్స్ ని అందులోనూ తల్లి సెంటిమెంట్ ని గొప్పగా పండిస్తాడని పేరున్న ప్రశాంత్ నీల్ సలార్ లో వాటిని నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లడం ఖాయం. ఆగస్ట్ లో ట్రైలర్ లాంచ్ జరిగే అవకాశాలున్నాయి. ఆదిపురుష్ ఫైనల్ రన్ ముగిసిపోయింది కాబట్టి ప్రభాస్ ప్రస్తుతం అందుబాటులోనే ఉన్నాడు. యాభై రోజుల విదేశీ ట్రిప్ పూర్తి చేసుకుని ఇటీవలే హైదరాబాద్ తిరిగి వచ్చాడు. హోంబాలే బృందంతో మాట్లాడి ప్రమోషన్ల కోసం డేట్లు బ్లాక్ చేసి మిగిలినవి కల్కి, మారుతి సినిమాలకు ఇవ్వబోతున్నాడు. అభిమానుల్లో సలార్ ఫీవర్ మొదలైపోయిందని ట్రెండ్ ని బట్టే చెప్పొచ్చు.

This post was last modified on July 29, 2023 12:01 pm

Share

Recent Posts

అనిల్ రావిపూడి అందుకే స్పెషల్

హెడ్డింగ్ చూడగానే ఏంటీ పొగడ్తనే అనుమానం రావొచ్చు కానీ అసలు విషయం తెలుసుకున్నాక నిజమే అనుకోక మానరు. విషయం ఏమిటంటే…

13 minutes ago

స్థాలిన్ కూడా నోరు జారితే ఎలా?

గత ఎన్నికల్లో ఓటమి పాలైన డీఎంకే అధినేత స్థాలిన్ దాన్నుంచి ఎలాంటి గుణపాఠం నేర్చుకున్నట్లు లేదు. ఆయన, ఆయన కుమారుడు…

54 minutes ago

వందల కోట్ల ఆస్తి మిస్సయిన నవదీప్

మంచి అందగాడు, పెర్ఫామెన్స్ విషయంలోనూ ఢోకా లేదు. అయినా నవదీప్ టాలీవుడ్లో అనుకున్నంత పెద్ద స్థాయికి వెళ్లలేకపోయాడు. తేజ మూవీ…

1 hour ago

పోటీకి రావడంలో ‘రియాలిటీ’ ఉద్దేశమేంటో

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం మంచి జోష్ లో ఉన్నాడు. చెన్నై లవ్ స్టోరీ థియేట్రికల్ రన్ లో సూపర్…

1 hour ago

కౌంట్ బాగుంది… ప్రేక్షకుల క్వాంటిటీ పెరగాలి

నిన్న కొత్త సినిమాలు చాలా రిలీజయ్యాయి. మాములుగా అయితే థియేటర్లు కిటకిటలాడిపోవాలి. అయితే ఆక్యుపెన్సీలు కొంచెం నెమ్మదిగా ఉన్న నేపథ్యంలో…

2 hours ago

లీక్ చెయ్యడానికి అదేమైనా ఆ టైపు సినిమానా?

ఈ శుక్రవారం ఒకేసారి నాలుగైదు చిన్న సినిమాలు రిలీజయ్యాయి. ఇంత పోటీలో వస్తున్నపుడు ప్రేక్షకుల దృష్టి తమ చిత్రం మీద…

3 hours ago