సినిమాల్లో వర్తమాన రాజకీయ పరిస్థితులను ప్రతిబింబించేలా సన్నివేశాలు, డైలాగులు పెట్టడం.. రాజకీయ నాయకులను గుర్తు తెచ్చేలా క్యారెక్టర్లను క్రియేట్ చేయడం కొత్తేమీ కాదు. అందులోనూ రాజకీయాలతో టచ్ ఉన్న ఫిలిం స్టార్లు తమ రాజకీయ భావజాలానికి తగ్గట్లు.. ప్రత్యర్థులను టార్గెట్ చేస్తూ సీన్లు రాయించుకోవడం గతంలోనూ చూశాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా అదే చేశాడు.
బ్రో సినిమాలో సందర్భానుసారం వైసీపీ నేతలను టార్గెట్ చేశాడు. అందులో ముఖ్యంగా అందరి దృష్టినీ ఆకర్షించింది. పృథ్వీ చేసిన శ్యామ్ బాబు పాత్రే. ముందు ఇది మామూలు పాత్రే అనుకుంటాం కానీ.. మై డియర్ మార్కండేయ పాట చూస్తే కానీ అది ఏపీ మంత్రి అంబటి రాంబాబును టార్గెట్ చేస్తూ పెట్టిన క్యారెక్టర్ అని అర్థం కాదు.
ఈ పాటలో శ్యాంబాబు పాత్ర మీద సెటైర్లు పడ్డాయి. ఈ పాటలో పృథ్వీ గెటప్, ఆయన స్టెప్పులు చూస్తే ఆటోమేటిగ్గా అంబటి రాంబాబు గుర్తుకొచ్చేస్తారు. ఈ ఏడాది సంక్రాంతి సంబరాల్లో భాగంగా రాంబాబు వేసిన స్టెప్పుల తాలూకు వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. దాదాపుగా అలాంటి టీషర్టే పృథ్వీకి వేయించి స్టెప్పులు కూడా ఇమిటేట్ చేయించారు. సడెన్‌గా మ్యూజిక్ ఆపించి..”శ్యాంబాబు పాట ఉన్న టెంపో ఏంటి? నువ్వు వేస్తున్న స్టెప్ ఏంటి?” అని పవన్ కళ్యాణ్ క్లాస్ తీసుకుంటాడు.
అంతే కాక పృథ్వీని ఉద్దేశించి ‘నెక్స్ట్ ఏంటి?’ అని పవన్ అడిగితే… ససెక్స్.స అంటాడు శ్యాంబాబు. దీనికి బదులుగా నీకె్పుడూ అదే ధ్యాస.. అందరూ మీలాగే ఎప్పుడూ దాని గురించే ఆలోచించరని పవన్ కౌంటర్ వేస్తాడు. అంతే కాక ఈ లలితకళల్ని వదిలేయమని ఘాటుగా చెబుతాడు. థియేటర్లో ఈ సన్నివేశాలను బంధించిన పవన్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. వైసీపీ నేతల మీద పవన్ ఇందులో మరికొన్ని పంచులు వేయడం గమనార్హం.