Movie News

వహాబ్ మరో రెహమాన్ అవుతాడా

సౌత్ సినిమాలో కొత్తగా దూసుకొస్తున్న సంగీత దర్శకుడు హేశం అబ్దుల్ వహాబ్ గురించి క్రమంగా మన అగ్ర హీరోలు ఎంక్వయిరీలు మొదలుపెట్టారు. విజయ్ దేవరకొండ ఖుషికి అతనిచ్చిన మెలోడియస్ ఆల్బమ్ మ్యూజిక్ లవర్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇతని చేతిలో నాని హాయ్ నాన్నతో పాటు శర్వానంద్ సినిమా ఉంది. క్రమంగా ఆఫర్లు పెరుగుతున్నా ఒక బ్లాక్ బస్టర్ పడ్డాక స్పీడ్ పెంచే ఆలోచనలో ఉన్నాడీ 32 ఏళ్ళ యువకుడు. ఇతని పుట్టిన దేశం సౌదీ అరేబియా అంటే ఆశ్చర్యం కలగక మానదు. 8 వయసులోనే పియానోతో సంగీత సాధన మొదలుపెట్టాడు.

ఉన్నత విద్యాభ్యాసం పూర్తి చేశాడు. 2007 లో ఇండియాక వచ్చి మలయాళంలో అవకాశాలు వెతుక్కోవడం మొదలుపెట్టాడు. 2013లో తొలి రికార్డింగ్ జరిగింది. ఆ తర్వాత రెండేళ్లకు సాల్ట్ మ్యాంగో ట్రీతో ఫస్ట్ ఆఫర్ పట్టాడు. తర్వాత చెప్పుకోదగ్గ సినిమాలు, హిట్లు కొట్టినా మొదటి బ్రేక్ మాత్రం 2022 హృదయంతో దక్కింది. అందులో 15 పాటలు భాషతో సంబంధం లేకుండా ఆన్ లైన్లో విపరీతంగా ఎక్కేశాయి. అది చూశాకే దర్శకుడు శివ నిర్వాణ ఖుషి కోసం హైదరాబాద్ తీసుకొచ్చాడు. దీని ఫస్ట్ సింగల్ వచ్చాక ఇతర నిర్మాతలు చెక్కులతో కలిశారు.

మాములుగా మ్యూజిక్ డైరెక్టర్లలో ముస్లిం వర్గానికి చెందిన వాళ్ళు తక్కువగా ఉంటారు. వాళ్లలో మొదటగా గుర్తొచ్చే పేరు ఏఆర్ రెహమాన్. మళ్ళీ ఇప్పుడు హేశం అబ్దుల్ వహాబ్ ఆ స్థాయికి చేరుకోవచ్చని అభిమానులు నమ్ముతున్నారు. అయితే ఇతను ఇప్పటిదాకా కమర్షియల్ సినిమాలు చేయలేదు. పెద్ద స్టార్ హీరోలను డీల్ చేయడంలో అనుభవం వస్తే నిజంగానే డిమాండ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. టాలీవుడ్లో తమన్, దేవి, అనూప్, మిక్కీ జె మేయర్ ఇలా ఆప్షన్స్ బాగా టైట్ అయిన తరుణంలో వహాబ్ లాంటి వాళ్లకు మంచి ఫ్యూచర్ ఉంది. మరి అంత నమ్మకాన్ని నిలబెట్టుకోవడం  అతని చేతుల్లోనే ఉంది. 

Share
Show comments
Published by
Satya

Recent Posts

జ‌గ‌న్ విధానాలు మార్చుకోవాల్సిందేనా…

మూడు రాజ‌ధానుల నుంచి మ‌ద్యం వ‌ర‌కు.. వ‌లంటీర్ వ్య‌వ‌స్థ నుంచి స‌చివాల‌యాల వ‌ర‌కు.. వైసీపీ అధినేత జ‌గ‌న్ చేసిన ప్ర‌యోగాలు…

28 minutes ago

బ్రాండ్ సెలబ్రిటీలు జాగ్రత్తగా ఉండాల్సిందే

వివాదాలకు ఎప్పుడూ దూరంగా ఉండే మహేష్ బాబు ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ కి బ్రాండ్ అంబాసడర్ గా పని…

43 minutes ago

కంటెంట్ బాగుందన్నారు….వసూళ్లు లేవంటున్నారు

ఇటీవలే విడుదలైన కేసరి చాఫ్టర్ 2కి యునానిమస్ గా పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. మూడుకు తక్కువ రేటింగ్స్ దాదాపుగా ఎవరూ…

1 hour ago

ఫిక్సింగ్ వాదనలతో రాజస్థాన్ కలకలం.. అసలేమైంది?

ఐపీఎల్‌ 2025లో ఓ మ్యాచ్‌ ఫలితం చుట్టూ బిగుసుకున్న వివాదం ఇప్పుడు తీవ్ర దుమారాన్ని రేపుతోంది. లక్నో సూపర్ జెయింట్స్‌తో…

2 hours ago

రివ్యూలపై కుండబద్దలుకొట్టిన నాని

టాలీవుడ్లో బాక్సాఫీస్ స్లంప్ వచ్చినపుడల్లా.. నిర్మాతల దృష్టి రివ్యూల మీద పడుతోంది. సినిమాలు దెబ్బ తినడానికి రివ్యూలే కారణమంటూ వాటి…

2 hours ago

ఏప్రిల్ 25 – వినోదానికి లోటు లేదు

ఇంకో శుక్రవారం వచ్చేస్తోంది. లాస్ట్ వీక్ భారీ అంచనాల మధ్య వచ్చిన అర్జున్ సన్నాఫ్ వైజయంతి, ఓదెల 2 ఆశించిన…

3 hours ago