మాములుగా పవన్ కళ్యాణ్ సినిమా బరిలో ఉందంటే ఎవరూ పోటీకి వచ్చేందుకు రిస్క్ తీసుకోరు. కానీ ఒక్క చిన్న చిత్రం ధైర్యం చేసిందంటే విశేషమే. బ్రహ్మాజీ కొడుకు సంజయ్ రావు హీరోగా రూపొందిన స్లం డాగ్ హస్బెండ్ రేపు విడుదల కాబోతోంది. బ్రోతో నేరుగా క్లాష్ చేయకుండా ఒక రోజు గ్యాప్ తీసుకుంటోంది. చిన్న మూవీ కావడంతో బ్రహ్మాజీ అంతా తానై ప్రమోషన్ల వ్యవహారాలు చూసుకుంటూ మీడియాతో రెగ్యులర్ గా టచ్ లో ఉంటున్నారు. తన పరిచయాలన్నీ వాడుకుని కంటెంట్ బాగుందనే విషయాన్ని సెలబ్రిటీల ద్వారా చెప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు.
శ్రీలీలను ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా తీసుకు వచ్చేందుకు ఒప్పించారు. పుష్ప 2 సెట్ లో అల్లు అర్జున్ కి ట్రైలర్ చూపించి టీమ్ మొత్తంతో కాంప్లిమెంట్స్ అందుకోవడం గురించి ప్రత్యేకంగా చెబుతున్నారు. సుకుమార్ వీడియో బైట్ పంపుతానని హామీ ఇచ్చారు. రామ్ గోపాల్ వర్మ దీనికి కుక్క మొగుడు టైటిల్ పెట్టమని సలహా ఇవ్వడం, స్క్రిప్ట్ లో అనిల్ రావిపూడి చేయూత, నాగార్జున అలీ లాంటి సెలబ్రిటీల మద్దతు ఇలా ఎన్నో విషయాలను బ్రహ్మాజీ దగ్గరుండి మరీ షేర్ చేసుకుంటూ వీలైనంత వరకు బజ్ తీసుకొచ్చేందుకు ఏ చిన్న అవకాశాన్ని వదిలిపెట్టడం లేదు.
ట్రైలర్ గట్రా చూస్తే చాలా వెరైటీ కాన్సెప్ట్ తో రూపొందిన స్లం డాగ్ హస్బెండ్ కు ఏఆర్ శ్రీధర్ దర్శకత్వం వహించగా ధమాకా ఫేమ్ భీమ్స్ సిసిరిలియో సంగీతం సమకూర్చారు. హీరోయిన్ ప్రణవి మానుకొండని ఆకట్టుకునేలా ప్రొజెక్ట్ చేస్తున్నారు. అంతా బాగానే ఉంది కానీ కంటెంట్ ఎక్స్ ట్రాడినరీగా ఉంటే తప్ప చిన్న సినిమాల కోసం జనం థియేటర్లకు రావడం లేదు. బేబీ, బలగం లాంటివి ధైర్యం ఇచ్చినా అవి సీరియస్ ఎమోషన్ల మీద నడిచాయి. స్లమ్ డాగ్ హస్బెండ్ పూర్తిగా కామెడీని నమ్ముకుంది. మరి ఏ మేరకు అంచనాలు నిలబెట్టుకుంటుందో చూడాలి.
This post was last modified on July 28, 2023 2:34 pm
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…
పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…
మలయాళ లెజెండరీ ఆర్టిస్ట్ మోహన్ లాల్ ఎంత గొప్ప నటుడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నాలుగు దశాబ్దాల కెరీర్లో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…
క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…