మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ‘భోళా శంకర్’ సెట్స్ మీదికి వెళ్లడానికి ముందు నుంచి చిరు అభిమానుల నుంచే తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. అందుకు ప్రధాన కారణం శక్తి, షాడో లాంటి డిజాస్టర్లు ఇచ్చి దాదాపు పదేళ్లుగా సినిమాలే తీయడం ఆపేసిన మెహర్ రమేష్‌ను ఈ సినిమాకు దర్శకుడిగా ఎంచుకోవడం.
దీనికి తోడు రీమేక్‌ల పట్ల ప్రేక్షకుల్లో ఆసక్తి సన్నగిల్లిపోవడం, పైగా ‘వేదాళం’ లాంటి పాత, రొటీన్ మాస్ మూవీని రీమేక్ చేయాలనుకోవడం. అందుకే సినిమా మొదలైన దగ్గర్నుంచి మెగా అభిమానులే నెగెటివ్‌గా మాట్లాడుతూ వచ్చారు. దీనికి తోడు సినిమా పోస్టర్లు కానీ.. పాటలు కానీ పెద్దగా ఎగ్జైట్ చేయలేకపోయాయి. చివరికి టీజర్ సైతం తీవ్రంగా నిరాశపరిచింది. పూర్తిగా ఔట్ డేటెడ్ సినిమా అన్న ఫీలింగ్ కలిగించింది టీజర్. అందులో చిరు తెలంగాణ యాసలో చెప్పిన డైలాగ్స్ సైతం ట్రోలింగ్‌కు గురయ్యాయి.
ఈ పరిస్థితుల్లో ‘భోళా శంకర్’కు బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి అనుభవం ఎదురవుతుందో అన్న సందేహాలు కలిగాయి. ‘వాల్తేరు వీరయ్య’తో బలంగా పుంజుకున్న చిరుకు మళ్లీ ‘ఆచార్య’ తరహా చేదు అనుభవం తప్పదేమో అన్న డిస్కషన్లు జరిగాయి. ఐతే ఈ రోజు రిలీజ్ చేసిన ‘భోళా శంకర్’ ట్రైలర్ కొంచెం మెరుగ్గానే కనిపించింది. ఒక్కసారిగా అభిప్రాయం మొత్తం మారిపోయేంత ఎఫెక్టివ్‌గా ట్రైలర్ లేదు కానీ.. టీజర్‌తో పోలిస్తే మాత్రం బెటరే.
సగటు మాస్ మసాలా సినిమాలా కనిపిస్తూ కమర్షియల్ హంగులకు, ఎలివేషన్లకు లోటు లేనట్లే కనిపించింది. చిరు డైలాగ్ డెలివరీ, ఆయన మేనరిజమ్స్ కూడా ఓకే అనిపించాయి. మాస్‌ను, అభిమానులను మెప్పిస్తూ ఓ మోస్తరు ఫలితంతో ‘భోళా శంకర్’ బయట పడిపోవచ్చనే సంకేతాలు కనిపిస్తున్నాయి. మరీ ఎక్కువ అంచనాలు పెట్టుకోకుండా సగటు మాస్ మూవీ చూద్దామని థియేటర్లకు వెళ్లే వాళ్లకు ‘భోళా శంకర్’ రుచించవచ్చు.
This post was last modified on July 27, 2023 11:28 pm
స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో సోమవారం నుంచి ప్రారంభమైన ప్రపంచ పెట్టుబడుల సదస్సుకోసం వెళ్లిన.. ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రులు నారా లోకేష్,…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కు టాప్ జాబ్ విషయంలో పార్టీ శ్రేణుల నుంచి పెద్ద ఎత్తున…
వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సు జరిగే దావోస్ వేదిక… ఎటు చూసిన రిచ్ లుక్ తో కనిపిస్తుంది. అక్కడ ఓ…
మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్ కెరీర్ కొన్నేళ్ల నుంచి తిరోగమనంలో పయనిస్తోంది. అతడికి సోలో హీరోగా ఓ మోస్తరు…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్… ఎలా కనిపిస్తారు? గతంలో అయితే అప్పుడప్పుడూ లైట్ కలర్…
ఏపీ సీఎం చంద్రబాబు నోటి నుంచి ఆశ్చర్యకరమైన వ్యాఖ్యలు వెలువడ్డాయి. మరో జన్మ అంటూ ఉంటే.. మళ్లీ తెలుగు వాడిగానే…