Movie News

హైదరాబాదీల ఫేవరెట్ మల్టీప్లెక్స్‌కి 20 ఏళ్లు

ఇప్పుడంటే చిన్న చిన్న పట్టణాల్లో కూడా మల్టీప్లెక్సులు వచ్చేశాయి. అత్యుత్తమ సీటింగ్, సౌండ్, విజువల్ ఎక్స్‌పీరియన్స్‌తో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచుతున్నాయి. కానీ 20 ఏళ్ల ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే కాక.. దేశవ్యాప్తంగా అన్ని చోట్లా సింగిల్ స్క్రీన్లదే రాజ్యం. మల్టీప్లెక్స్ అంటే ఏంటో కూడా తెలియదు అప్పటిదాకా జనాలకి. మహా అయితే ఒకే కాంపౌండ్లో వేర్వేరు థియేటర్లుండేవి. వాటన్నింట్లో కూడా సినిమా చూసే అనుభూతి మాత్రం సేమ్.

అలాంటి సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాద్ నడిబొడ్డున హుస్సేన్ సాగర్ పక్కన మొదలైందే ప్రసాద్ మల్టీప్లెక్స్. ఒకేచోట ఐదారు స్క్రీన్లతో.. వాటిలో బెస్ట్ క్వాలిటీతో సినిమాలను ప్రదర్శించడం మొదలయ్యాక ప్రేక్షకుల్లో ఎక్కడెక్కడి నుంచే అక్కడికి రావడం మొదలైంది. సింగిల్ స్క్రీన్లతో పోలిస్తే కొంచెం ఎక్కువ రేటుతో బెస్ట్ వ్యూయింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తూ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ప్రసాద్స్.. హైదరాబాదీ సినిమా ప్రియుల రెండో ఇల్లుగా మారిపోయిందంటే అతిశయోక్తి కాదు.

ఈ 20 ఏళ్లలో మల్టీప్లెక్స్ ఇండస్ట్రీ దిన దిన ప్రవర్ధమానం చెంది.. నగరం మొత్తంలో వందల్లో మల్టీప్లెక్స్ స్క్రీన్స్ వచ్చేశాయి. సింగిల్ స్క్రీన్ల సంఖ్యను అవి దాటేశాయి. పీవీఆర్, ఐనాక్స్, ఏషియన్, బిగ్ సినిమాస్.. ఇలా బోలెడన్ని మల్టీప్లెక్సులు చూస్తున్నాం. కానీ ఇప్పటికీ హైదరాబాదీలకు ‘ప్రసాద్ మల్టీప్లెక్స్’ చాలా ప్రత్యేకం. ప్రతి కొత్త సినిమాకు ఫస్ట్ షో పడేది ఇక్కడే. 8.45కి ప్రసాద్స్‌లో ఫస్ట్ షో చూడటం సెలబ్రెటీలకు, మీడియా ప్రతినిధులతో పాటు సినీ ప్రియులకు ఇష్టమైన వ్యాపకం.

శుక్రవారం ఉయదం సెలబ్రెటీలు, మీడియా ప్రతినిధుల హడావుడికి తోడు.. షో అయ్యాక టీవీ, యూట్యూబ్ ఛానెళ్ల మైకుల ముందు రివ్యూలు చెప్పే సినిమా ప్రియుల హంగామాతో అక్కడ సందడే వేరుగ ఉంటుంది. మిగతా మల్టీప్లెక్సులకు దీటుగా క్వాలిటీ, వ్యూయింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తూనే.. రీజనబుల్ టికెట్, తినుబండారాల ధరలతో తన ప్రత్యేకతను చాటుకుంటూ ఉంటుంది ప్రసాద్స్. ఇక్కడి లార్జ్ స్క్రీన్ దేశంలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ అనడంలో సందేహం లేదు. అవతార్ లాంటి సినిమాలు చూడాలంటే దీన్ని మించిన స్క్రీన్ లేదు.

వేరే రకమైన ఎంటర్టైన్మెంట్స్, షాపింగ్ ఆకర్షణలతోనూ ప్రసాద్స్ ఎప్పుడూ జనాలతో కళకళలాడుతుంటుంది. ఇదొక ల్యాండ్ మార్క్ టూరిస్ట్ స్పాట్ కూడా. హైదరాబాద్ చూసేందుకు వచ్చే ప్రతి ఒక్కరూ కూడా ప్రసాద్స్‌పై ఒక లుక్కేయాలని, ఇక్కడ సినిమా చూడాలని కోరుకుంటారు. 20 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రసాద్స్ సంబరాలకు సిద్ధమవుతూ ఒక వీడియోను కూడా రిలీజ్ చేసింది. ఇది సెలబ్రెటీలతో పాటు సినీ ప్రియులందరిలోనూ ఒక ఎమోషన్ తీసుకొస్తోంది.

This post was last modified on July 27, 2023 8:34 pm

Share

Recent Posts

జ్ఞానేష్ పై కేసులు తవ్వుతున్న కాంగ్రెస్

భారత ఎన్నికల సంఘంలో అత్యంత వివాదాస్పద కమిషనర్ గా పేరొందిన జ్ఞానేష్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంది. కేంద్రంలోని బీజేపీ…

3 minutes ago

55 శాతం తెలంగాణ యువతకు జుట్టు సమస్యలు

యువత జీవితంలో కెరీర్, ఉద్యోగం, ఆర్థిక బాధ్యతలు కీలక దశను నిర్ణయిస్తాయి. అయితే ఇదే సమయంలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి…

1 hour ago

సైబ‌రాబాద్‌కు ప్ల‌స్‌గా అమ‌రావ‌తి!

ఐటీ రంగానికి కేంద్రంగా మారిన తెలంగాణ‌లోని సైబ‌రాబాద్‌కు ప్ల‌స్‌గా అమ‌రావ‌తిని నిర్మిస్తున్నామ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలో…

1 hour ago

మురారి చూసే వారాహి తీశా

సీనియ‌ర్ న‌టుడు సుమంత్ ప్ర‌ధాన పాత్ర‌లో వ‌చ్చిన కొత్త సినిమా మ‌హేంద్రగిరి వారాహి మీద విడుద‌ల‌కు ముందు మంచి అంచ‌నాలే…

3 hours ago

జూనియర్ విజయ్ నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది

తమిళనాడు సిఎం విజయ్ వారసుడిగా జేసన్ సంజయ్ హీరోగా తెరంగేట్రం చేసి ఉంటే ఈపాటికి అభిమానులు, నిర్మాతలు రెడ్ కార్పెట్…

5 hours ago

వెంకటేష్ చేసింది మంచి పనే

హిందీలో దృశ్యం 3 బాగా ఆడుతున్న టైంలో టాలీవుడ్ ప్రేక్షకులకు వస్తున్న సందేహం ఒకటుంది. ఒకవేళ వెంకటేష్ కనక మూడో…

6 hours ago