హరీష్ శంకర్ ఇప్పటిదాకా ఏడు సినిమాలు డైరెక్ట్ చేశాడు. వాటన్నింట్లో అత్యంత ప్రత్యేకమైన సినిమా ‘గబ్బర్ సింగ్’ అనడంలో మరో మాట లేదు. ఆ సినిమా కంటే ముందు రెండు.. తర్వాత నాలుగు చిత్రాలు తీశాడు హరీష్. కానీ ఇప్పటికీ హరీష్ అనగానే అందరికీ ‘గబ్బర్ సింగ్’యే గుర్తుకు వస్తుంది. ఇది రీమేక్ మూవీ అయినప్పటికీ.. కథాకథనాల్లో చాలా మార్పులు చేర్పులు చేసి.. పవన్ కళ్యాణ్ ఇమేజ్‌కు తగ్గట్లు ఈ సినిమాను మలిచిన విధానం అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది.
పదేళ్ల పాటు సరైన విజయం లేని పవన్‌కు ఈ సినిమా భారీ విజయాన్నందించింది. తనెంతో కష్టపడి, ఇష్టపడి, తపనతో చేసిన సినిమా విషయంలో హరీష్ కూడా ఎంతో ప్రౌడ్‌గా ఫీలవుతుంటాడు. ఇలాంటి సినిమా విషయంలో సక్సెస్ క్రెడిట్ ఇంకొకరికి ఇవ్వాలంటే ఎవ్వరికైనా మనసు ఒప్పుకోదు. హరీష్ కూడా అందుకు మినహాయింపు కాలేదు.
పవన్ కొత్త సినిమా ‘బ్రో’ ప్రి రిలీజ్ ఈవెంట్లో తన మిత్రుడైన దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు గొప్ప ఎలివేషన్ ఇచ్చాడు. దీని మీద సోషల్ మీడియాలో అభిమానులు రకరకాలుగా స్పందించారు. అందులో భాగంగా ఓ అభిమాని త్రివిక్రమ్.. పవన్‌కు ఎలాంటి తోడ్పాటు అందించాడో చెబుతూ ఒక పోస్టు పెట్టాడు. అందులో ‘గబ్బర్ సింగ్’ సక్సెస్ వెనుక కూడా త్రివిక్రమ్ ఉన్నట్లు పేర్కొన్నాడు. ఐతే ఈ సినిమా రైటింగ్ విషయంలో త్రివిక్రమ్ భాగస్వామ్యం ఏమీ లేదని, కాబట్టి ఆయనకు క్రెడిట్ ఇవ్వడం కరెక్ట్ కాదన్నట్లు మరో నెటిజన్ వ్యాఖ్యానించగా.. దీనికి హరీష్ శంకర్ ఒక ఫన్నీ జిఫ్ ద్వారా స్పందించాడు.
ఆ తర్వాత అసలు పోస్టు పెట్టిన నెటిజన్ తన వివరణ ఇచ్చాడు. ఈ సినిమాను నిర్మాతలకు సజెస్ట్ చేసింది త్రివిక్రమ్ అని.. కథ, మాటల్లో ఆయన భాగస్వామ్యం ఏమీ లేదని అందరికీ తెలుసని.. సినిమా క్రెడిట్ అంతా హరీష్‌దేనంటూ ఆయనకు సారీ చెప్పాడు. దీనికి హరీష్.. మనలో మనకు సారీ ఎందుకంటూ తాను దర్శకుడికంటే ముందు పవన్ అభిమానినని.. అభిమానులందరం ఒక్కటిగా ఉంటే ఎవ్వరూ ఇలాంటి రూమర్లను ప్రచారం చేయలేరని అన్నాడు. మొత్తానికి అంత కష్టపడి ‘గబ్బర్ సింగ్’ తీస్తే.. ఆ క్రెడిట్ త్రివిక్రమ్‌కు ఇచ్చేసరికి హరీష్ కొంచెం హర్టయినట్లే కనిపిస్తున్నాడు. అతనలా ఫీలవ్వడంలోనూ న్యాయం ఉంది.
This post was last modified on July 27, 2023 5:55 pm
మలయాళ లెజెండరీ ఆర్టిస్ట్ మోహన్ లాల్ ఎంత గొప్ప నటుడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నాలుగు దశాబ్దాల కెరీర్లో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…
క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…