మాములుగా దేవుడి కాన్సెప్ట్ మీద తీసే సినిమాలకు క్లీన్ యు సర్టిఫికెట్ వస్తుంది. ఎందుకంటే అభ్యంతరక, అసభ్య సన్నివేశాలు ఉండవు కాబట్టి. కానీ ఆగస్ట్ 11న విడుదల కాబోతున్న అక్షయ్ కుమార్ ఓ మై గాడ్ 2కి సెన్సార్ అధికారులు షాక్ ఇచ్చారు. ఏకంగా ఇరవై కట్లను రికమండ్ చేస్తూ, ఒకవేళ వాటికి ఒప్పుకోని పక్షంలో అడల్ట్ ఓన్లీ ఇస్తామని నిర్మాతలకు చెప్పారట. దీంతో ఖంగారెత్తిన నిర్మాతలు రివైజింగ్ కమిటీకి అప్పీల్ చేశారు. దీని మొదటి భాగం బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. తెలుగులో గోపాల గోపాల, కన్నడలో ముకుంద మురారిగా రీమేకై మంచి విజయం అందుకుంది.
అందుకే సీక్వెల్ అనగానే సహజంగానే అంచనాలు ఉంటాయి. దర్శకుడు అమిత్ రాయ్ కావాలనే ఇందులో కాంట్రావర్సి అంశాలు పొందుపరిచారని, కులాలు మతాలకు సంబంధించిన కొన్ని సున్నితమైన విషయాలను టచ్ చేయడం వల్లే సెన్సార్ అబ్జెక్షన్ వచ్చిందని ముంబై టాక్. ఓ మై గాడ్ కు పిల్లల ఫాలోయింగ్ ఉంది. అలాంటప్పుడు ఎందుకిలా చేశారనే అనుమానం రావడం సహజం. కాశిలో నివసించే అపర భక్తుడిగా పంకజ్ త్రిపాఠి, భువికి దిగివచ్చే శివుడిగా అక్షయ్ కుమార్ ఇందులో నటించారు. టీజర్ హైప్ తీసుకురాగా ఫ్యాన్స్ ట్రైలర్ కోసం ఎదురు చూస్తున్నారు.
అసలే అక్షయ్ వరస డిజాస్టర్లతో మార్కెట్ ని రిస్కులో పెట్టుకున్నాడు. ఇప్పుడీ పరిణామాలు మరింత ఇబ్బంది కలిగిస్తున్నాయి. ఓ మై గాడ్ 2 కన్నా అదే రోజు రిలీజవుతున్న గదర్ 2 మీద ట్రేడ్ వర్గాలు ఎక్కువ నమ్మకం పెట్టుకున్నాయి. మాస్ ని సన్నీ డియోల్ థియేటర్లకు తెస్తాడని ఎదురు చూస్తున్నారు. అలాంటప్పుడు ఓ మై గాడ్ 2 వైపు ఆడియన్స్ కన్నెత్తి చూడాలంటె అది న్యూస్ లో నలగాలి. అందుకే ఇలా చేశారనే ప్రచారం కూడా ఉంది. మొత్తానికి దేవుడిని హైలైట్ చేస్తూ రూపొందిన ఒక సినిమాకు ఇలా జరగడం మాత్రం బహుశా ఇదే మొదటిసారని చెప్పొచ్చు.
This post was last modified on July 27, 2023 1:23 pm
టిక్ టాక్... చైనాకు చెందిన ఈ షార్ట్ వీడియో షేరింగ్ ప్లాట్ ఫామ్ అగ్రరాజ్యం అమెరికాలో నిషేధానికి గురైపోయిన సోషల్…
ఇటీవలే బాలీవుడ్ కల్ట్ క్లాసిక్ సత్య రీ రిలీజయ్యింది. 1998లో మొదటిసారి విడుదలైనప్పుడు ఇదో మాస్టర్ పీస్ లా నిలిచిపోయింది.…
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంత పెద్ద ప్యాన్ ఇండియా బ్లాక్ బస్టర్ అయినా మహా అయితే నెల రోజులు స్ట్రాంగ్ రన్…
టాలీవుడ్ కు అత్యంత కీలకమైన సంక్రాంతి పండగ అయిపోయింది. నిన్నటితో సెలవులు పూర్తయిపోయాయి. బాక్సాఫీస్ విజేతగా ఒక్క శాతం అనుమానం…
ఇటీవలే ముగిసిన సంక్రాంతి సంబరాల్లో ఏపీలోని ఉభయ గోదావరి జిల్లాల్లో భారీ ఎత్తున కోడి పందేలు జరిగాయి. ఈ పందేలను…
వరల్డ్ ఎకనమిక్ ఫోరం 55వ వార్షిక సదస్సులు సోమవారం దావోప్ లో ప్రారంభం కానున్నాయి. దాదాపుగా విశ్వవ్యాప్తంగా ఉన్న అన్ని…