‘శతమానం భవతి’ సినిమాతో దర్శకుడు సతీశ్ వేగేశ్న ఎంత మంచి పేరు సంపాదించాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ‘ఖైదీ నంబర్ 150’, ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ లాంటి భారీ చిత్రాలతో పోటీ పడి ఆ సినిమా అనూహ్య విజయం సాధించింది. విమర్శకుల ప్రశంసలు కూడా బాగానే అందుకున్న ఆ చిత్రం.. జాతీయ అవార్డు సైతం అందుకుంది.
ఇలాంటి సినిమా తీసిన దర్శకుడు మూడేళ్లు తిరిగేసరికి రెండు పేలవమైన సినిమాలతో తెచ్చుకున్న పేరంతా పోగొట్టుకున్నాడు. ‘శతమానం భవతి’ తర్వాత ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ‘శ్రీనివాస కళ్యాణం’ మరో ‘బ్రహ్మోత్సవం’లా అనిపిస్తే.. ఆ తర్వాత వచ్చిన ‘ఎంతమంచివాడవురా’ ప్రేక్షకులను టార్చర్ పెట్టేసింది.
‘శతమానం భవతి’ కంటే ముందు సతీశ్.. రామదండు, దొంగలబండి అనే సినిమాలు తీశాడు. అవి ఏమాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. దీంతో చాలా గ్యాప్ తీసుకుని ‘శతమానం భవతి’తో సెన్సేషన్ క్రియేట్ చేశాడు. కానీ ఆ సినిమా తర్వాత ట్రాక్ తప్పాడు. చివరికిప్పుడు తన కొడుకు సమీర్ వేగేశ్న, ‘రాజ్‌దూత్’తో పరిచయమైన శ్రీహరి కొడుకు మేఘాంశ్‌లను హీరోలుగా పెట్టి ఏదో కమర్షియల్ ఎంటర్టైనర్ తీయబోతున్నట్లు మీడియాకు వెల్లడించాడు. ఈ సినిమాపై జనాల్లో ఏమాత్రం ఆసక్తి ఉంటుందన్నది సందేహమే.
‘శతమానం’ భవతితో స్టార్ డైరెక్టర్ అయిపోతాడని.. స్టార్లను డీల్ చేస్తాడని అనుకుంటే.. ఇలాంటి స్థితికి వస్తాడని ఎవ్వరూ అనుకోలేదు. సక్సెస్ సాధించడం కంటే దాన్ని నిలబెట్టుకోవడం, ఆ తర్వాత అంచనాలు అందుకోవడం కష్టం అనడానికి సతీశ్ ఉదాహరణగా నిలుస్తున్నాడు. ఇదిలా ఉండగా సతీశ్ నిర్మాతగా మారి అల్లరి నరేష్ హీరోగా విజయ్ కనకమేడల దర్శకత్వంలో తెరకెక్కించిన ‘నాంది’ కొంత ఆశలు రేకెత్తిస్తోంది.
This post was last modified on August 16, 2020 4:43 pm
భర్త మరో మహిళతో కారులో కనిపించాడు. అది చూసిన భార్య వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించింది. కానీ భర్త కారు ఆపకుండా…
నిన్న ఉన్నట్టుండి ఆదర్శ కుటుంబం ఏకె 47 పండగ బరి నుంచి తప్పుకుందనే వార్త సోషల్ మీడియాని ఊపేసింది. ఇంకా…
స్వంత కుటుంబం సినిమా. కార్తికేయ నిర్మాతగా వ్యవహరించి పక్క భాషనుంచి ఫహద్ ఫాసిల్ ని తీసుకొచ్చి తీసిన మూవీ. పైగా…
కొత్త సినిమా రిలీజ్ అంటే బడ్జెట్ తో సంబంధం లేకుండా ప్రతిదానికి ఎంతో కొంత ఓపెనింగ్ ఇచ్చే ప్రేక్షక వర్గం…
దసరా పండగ సందర్భంగా విడుదల కాబోతున్న సినిమాల్లో రణబాలి మీద భారీ అంచనాలున్న సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ, రష్మిక…
ఏపీ రాజధాని అమరావతిలో తెలంగాణా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ అంతర్జాతీయ ప్రమాణాలతో హోటల్ నిర్మిస్తున్నట్లు పుకార్లు షికార్లు…