యాభై రోజుల సుదీర్ఘ హాలిడే వెకేషన్ కోసం అమెరికా వెళ్లిన ప్రభాస్ ఇవాళ తిరిగి వచ్చేశాడు. సరిగ్గా ఆదిపురుష్ విడుదలకు రెండు మూడు రోజుల ముందు వెళ్లిన డార్లింగ్ అది ఫుల్ రన్ పూర్తి చేసుకుని దాన్ని అన్ని థియేటర్లలో తీసేశాక తిరిగి వచ్చాడు. మధ్యలో ఎక్కడా దాని గురించి మాట్లాడ్డం కానీ, వీడియో మెసేజ్ లు ఇవ్వడం కానీ ఏదీ చేయలేదు. ఎంతసేపూ దర్శకుడు రచయిత వివాదాలకు సంబంధించి వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది తప్పించి ప్రభాస్ తానుగా ఇన్వాల్వ్ కాలేదు. తిరుపతిలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రావడం తప్ప అంతకు మించి అత్యుత్సాహం చూపలేదు.
ఆదిపురుష్ విషయంలో జరగబోయే పరిణామాలు ముందుగానే ఊహించే ప్రభాస్ చాలా తెలివిగా వ్యవహారించాడని సన్నిహితులు అంటున్నారు. ఎంతగా హెచ్చరించినా దర్శకుడు ఓం రౌత్ తన సూచనలు సలహాలు పట్టించుకోలేదు కనకనే ఫలితంతో సంబంధం లేనట్టు ప్రభాస్ మిన్నకుండిపోయాడని చెబుతున్నారు. ఎలా చూసిన ప్రభాస్ చేసింది మంచి పనే. ఒకవేళ ఇండియాలోనే అందుబాటులో ఉంటే మీడియా అడిగే ప్రశ్నలకు ఇబ్బంది పడాల్సి వచ్చేది. పైగా లోకల్ లో ఉన్నందుకు ఏదైనా ఇష్యూ వచ్చినా స్పందించాల్సి ఉంటుంది . ఇప్పుడా ఇబ్బంది లేదు.
తన ఇమేజ్ వల్ల నష్టాల శాతం బాగా తగ్గిపోయినా ఆదిపురుష్ మాత్రం ఆడియన్స్ మనసులు గెలుచుకోలేదు. ప్రభాస్ కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుని ప్రాజెక్ట్ కె, మారుతీ సినిమాలకు అవసరమైన డేట్లను ఇచ్చేస్తాడు. మొదటి ప్రాధాన్యం నాగ్ అశ్విన్ కే కాబట్టి ఎక్కువ రోజులు తనకే ఇచ్చే ఛాన్స్ ఉంది. ఇవి పూర్తయ్యాక సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ తాలూకు పనులు మొదలవుతాయి. వీటి కన్నా ముందు ఆగస్ట్ చివరి వారం నుంచి సలార్ ప్రమోషన్లు ఉంటాయి కనక ప్రభాస్ సెప్టెంబర్ మొత్తం పెద్దగా షూట్లు చేయకపోవచ్చు. బాగా రిలాక్స్ మూడ్ లో ఉన్న డార్లింగ్ కోసం బిజీ షెడ్యూల్స్ స్వాగతం పలుకుతున్నాయి.
This post was last modified on July 26, 2023 5:16 pm
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…