థమన్ ని మర్చిపోతే ఎలా పవన్?

పవన్ కళ్యాణ్ సాంగ్స్ కి సెపరేట్ క్రేజ్ ఉంటుంది. మణిశర్మ, రమణ గోగుల లాంటి టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ పవన్ కి ది బెస్ట్ ఆల్బమ్స్ ఇచ్చారు. ఆ తర్వాత దేవి శ్రీ ప్రసాద్, అనూప్ రూబెన్స్ లతో వర్క్ చేశాడు పవన్. అయితే ఇటీవలే పవన్ సినిమా అంటే దానికి పక్కా థమన్ మ్యూజిక్ ఉండాల్సిందే అన్నట్టు అయిపోయింది.

వకీల్ సాబ్ , భీమ్లా నాయక్, ఇప్పుడు బ్రో కి వరుసగా పవన్ మూడు సినిమాలకు థమన్ మ్యూజిక్ ఇచ్చాడు. వకేల్ సాబ్ లో మహిళల కోసం థమన్ కంపోజ్ చేసిన మగువా సాంగ్ బాగా పాపులర్ అయింది. ఆ తర్వాత భీమ్లా నాయక్ కి మంచి సాంగ్స్ తో పాటు అదిరిపోయే స్కోర్ ఇచ్చాడు. ఇలా తనతో వరుసగా మూడు సినిమాలు చేసి మంచి మ్యూజిక్ ఇచ్చిన థమన్ ను పవన్ మర్చిపోయాడు. నిన్న బ్రో ఈవెంట్ లో కొందరు తెలియని టెక్నీషియన్స్ పేర్లు రాసుకొని వారి గురించి ఒక్కో ముక్క చెప్పిన పవన్ అందులో థమన్ పేరు చూసి వకీల్ సాబ్ మ్యూజిక్ మీరే కదా అని అడగడమే కాదు భీమ్లా నాయక్ కి కూడా మీరేనా ? అంటూ అడిగి థాంక్స్ చెప్పాడు. చివర్లో మనది హ్యాట్రిక్ అంటూ మళ్లీ కవర్ చేసుకున్నాడు పవన్.

ఏ సినిమాకైనా సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ చాలా ఇంపార్టెంట్. మరి తనతో మూడు సినిమాలు చేసిన థమన్ ను పవన్ మర్చిపోవడం, వేదికపై ఇలా వకీల్ సాబ్ కి మీరేనా? అడగడం ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చింది. ఏదేమైనా థమన్ కి ఇప్పుడు బ్యాడ్ టైమ్ నడుస్తుంది. మహేష్ సినిమా నుండి ఔట్ అని అంటున్నారు. బ్రో సాంగ్స్ కి రీచ్ లేదు. ఇప్పుడు పవన్ ఏకంగా థమన్ నే మర్చిపోయాడు.