Movie News

సరైన టైంలో క్లాసు తీసుకున్న పవన్

నిన్న అట్టహాసంగా జరిగిన బ్రో ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ కోలీవుడ్ పరిశ్రమపై చేసిన కామెంట్లు హాట్ టాపిక్ గా మారాయి. ముప్పై అయిదు నిమిషాల తన సుదీర్ఘ ప్రసంగంలో ఇటీవలే తమిళ నటీనటుల సంఘం జారీ చేసిన మార్గదర్శకాల గురించి గట్టి క్లాసు తీసుకున్నారు. కేవలం తమ రాష్ట్రానికి చెందినవాళ్లనే తీసుకోవాలంటూ, అత్యవసరమైతేనే షూటింగులు బయట చేయాలంటూ ఇచ్చిన గైడ్ లైన్స్ పట్ల ఇప్పటికే పలు విమర్శలు తలెత్తుతున్నాయి. ఈ ఇష్యూ గురించి ఇప్పటిదాకా తెలుగు ఇండస్ట్రీ తరఫున ఎవరూ మాట్లాడలేదు. పవనే స్పందించాడు.

ఏ భాషలో సినిమాలు తీసేవాళ్ళయినా సరే ప్రాంతీయ పరిమితులు పెట్టుకోకూడదని, బ్రోకు పని చేసిన సముతిరఖని తమిళనాడు, ఛాయాగ్రహణం నిర్వహించిన సుజిత్ వాసుదేవన్ కేరళ, పబ్బు సాంగ్ చేసిన ఊర్వశి రౌతేలా ముంబై నుంచి వచ్చారని ఇలా అందరూ కలిస్తేనే గొప్ప చిత్రాలను తీయగలమని హితవు పలికారు. రోజా, జెంటిల్ మెన్ లాంటివి తీసిన ఏఎం రత్నం తెలుగువాడేనని గుర్తు చేశారు. నిజానికి రత్నం నిర్మించింది భారతీయుడు, బాయ్స్ విజయ్ ఖుషి వగైరాలు. పవన్ ఉదాహరించినవి డబ్బింగ్ చేసినవి. స్పీచ్ వైరల్ కావడంతో సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరుగుతోంది.

ఒకరకంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ సరైన టైంలోనే క్లాసు తీసుకున్నారు. కేవలం తమిళులకు మాత్రమే అవకాశాలు ఇవ్వాలనడం సరికాదు. అలా అయితే కర్ణాటక నుంచి వచ్చిన రజనీకాంత్, తెలుగు మూలాలున్న విశాల్ తదితరులను బయటికి పొమ్మని అనలేరు కదా. అయినా ఆర్ఆర్ఆర్ లాగా పొన్నియిన్ సెల్వన్ ఎందుకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోలేదు. కేవలం అరవ ఫ్లేవర్ ఎక్కువ కావడం వల్లే. గ్లోబల్ అప్పీల్ ఉన్న సినిమాలు కోలీవుడ్ నుంచి వచ్చి చాలా కాలమయ్యింది. అలా ఎందుకు జరుగుతుందో గుర్తించకుండా చర్యలకు దిగడం ఫలితాన్ని ఇవ్వదు.

This post was last modified on %s = human-readable time difference 8:34 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

హనుమంతుడు రిషబ్ అయితే రానా ఎవరు

2024 బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచిన హనుమాన్ కొనసాగింపు జై హనుమాన్ ఇటీవలే అధికారికంగా ప్రకటించారు. నిర్మాణ…

2 hours ago

దిల్ రాజు దండయాత్రకు రంగం సిద్ధం

నిన్న జరిగిన లక్కీ భాస్కర్ సక్సెస్ మీట్ లో నిర్మాత నాగవంశీని ఉద్దేశించి దిల్ రాజు ఒక మాటన్నారు. తనను…

3 hours ago

స్నేహం…గుడి భూముల మోసం…భైరవం

నాలుగేళ్ల క్రితం 2021లో అల్లుడు అదుర్స్ తర్వాత బెల్లంకొండ సాయిశ్రీనివాస్ మళ్ళీ తెలుగు సినిమాలో కనిపించలేదు. అనవసరంగా బాలీవుడ్ మార్కెట్…

4 hours ago

గుడ్ జోక్….బన్నీ మీద బఘీరా కోపం !

అత్త మీద కోపం దుత్త మీద చూపిస్తే పనయ్యే రోజులు కావివి. అలా చేయొచ్చనుకోవడమే అసలు కామెడీ. ఇటీవలే కన్నడ,…

5 hours ago

నిధి అగర్వాల్ మూడు ప్యాన్ ఇండియా బ్లాస్టులు

హీరోయిన్లకు ఒక్కోసారి కెరీర్ లో స్పీడ్ బ్రేకర్ లాంటి దశ వస్తుంది. అప్పుడు ఎంత బ్లాక్ బస్టర్ సాధించినా అవకాశాలు…

6 hours ago

నేను హోం మంత్రి అయితే…పవన్ షాకింగ్ కామెంట్లు

పిఠాపురంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్న సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆడపిల్లలను అవమానిస్తుంటే చర్యలు తీసుకోరా?…

6 hours ago