బండ్ల గణేష్ ‘బ్రో’ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్‌కు అతిథుల్లో ఒకరిగా వస్తున్నారు అనగానే.. సోషల్ మీడియా జనాలు యాక్టివ్ అయిపోయారు. బండ్ల రాక పవన్ కళ్యాణ్ అభిమానులకు పెద్ద టాపిక్‌గా మారిపోయింది. పవన్ సినిమాల వేడుకల్లో బండ్ల చేసే హడావుడి అలా ఉంటుంది మరి. ‘గబ్బర్ సింగ్’ వేడుకలో పవన్‌ను ఆకాశానికి ఎత్తేస్తూ బండ్ల గణేష్ చేసిన ప్రసంగం ఇప్పటికీ చర్చనీయాంశమే.
‘వకీల్ సాబ్’ వేడుకలోనూ బండ్ల అలాంటి పవర్ ఫుల్ స్పీచే ఇచ్చాడు. పవన్‌ను పొగడాలంటే బండ్ల తర్వాతే ఎవరైనా అనే ఫీలింగ్ అభిమానుల్లో ఉంది. ఫ్యాన్స్‌కు అతను అలాంటి కిక్ ఇస్తాడు. ఐతే ‘భీమ్లా నాయక్’ వేడుకకు పవన్ రాకపోవడం అప్పట్లో చర్చనీయాంశం అయింది. ఆ సినిమాకు అన్నీ తానై వ్యవహరించిన త్రివిక్రమ్ శ్రీనివాసే.. బండ్లకు అడ్డం పడ్డాడనే ప్రచారం జరిగింది. స్వయంగా బండ్లనే ఒక అభిమానితో జరిపిన ఫోన్ సంభాషణలో త్రివిక్రమ్ మీద ఆరోపణలు గుప్పించాడు. బూతులు తిట్టాడు.
పవన్‌కు తాను దూరం కావడానికి, ఆయనతో మళ్లీ సినిమా చేయలేకపోవడానికి కూడా త్రివిక్రమే కారణమని బండ్ల బలంగా నమ్ముతున్నాడు. ఈ నేపథ్యంలోనే ట్విట్టర్లో పరోక్షంగా త్రివిక్రమ్ మీద పంచులు కూడా వేశాడు. ఇలాంటి నేపథ్యంలో బండ్ల ‘బ్రో’ ఈవెంట్‌కు రాబోతుండటం, త్రివిక్రమ్‌తో వేదిక పంచుకోబోతుండటం ఆసక్తి రేకెత్తిస్తోంది. మీమర్స్ ఆల్రెడీ ఈ విషయంలో డ్యూటీ ఎక్కేశారు.
బండ్ల, త్రివిక్రమ్ రైవల్రీ మీద మీమ్స్, జోక్స్ రెడీ చేసి వదిలేస్తున్నారు. ఒకప్పుడు సంచలనం రేపిన సెంటర్ ఫ్రూట్ యాడ్ నేపథ్యంలో పవన్ కళ్యాణ్‌ను త్రివిక్రమ్, బండ్ల గణేష్ పోటీ పడి పొగడ్డం మొదలుపెడితే ఎలా ఉంటుందో చూపిస్తూ.. చివరికి ఈ పోటీలో బండ్లనే గెలిచినట్లుగా చేసిన మీమ్ భలే ఎంటర్టైనింగ్‌గా ఉంది. ఇలాంటి మీమ్స్ మరెన్నో సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. మరి ఈ వేడుకలో త్రివిక్రమ్, బండ్ల మధ్య రిలేషన్ ఎలా ఉంటుందో.. ఆ ఇద్దరూ పవన్ గురించి ఏం మాట్లాడతారో చూడాలి.
This post was last modified on July 25, 2023 2:43 pm
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…