ఒకప్పుడు మార్కెట్, క్రియేటివిటీ రెండూ పరిమితంగా ఉన్న శాండల్ వుడ్ గత కొన్నేళ్లలో బాగా పురోగతి చెందింది. ముఖ్యంగా అవుట్ అఫ్ ది బాక్స్ ఐడియాలతో వినూత్న ప్రయోగాలకు శ్రీకారం చుడుతూ మంచి విజయాలు అందుకుంటున్నారు. కెజిఎఫ్, కాంతార లాంటివి ఒక క్యాటగిరీ అయితే కిరిక్ పార్టీ, 777 ఛార్లీ లాంటి లో బడ్జెట్ మూవీస్ మరో బాపతు. ఇవన్నీ బ్లాక్ బస్టర్ సాధించినవే. తాజాగా అలాంటి మరో చిత్రం కర్ణాటకలో దూసుకుపోతోంది. అదే హాస్టల్ హుడుగురు బేకాగిద్దరే. అంటే దానర్థం హాస్టల్ పిల్లలు కోరుకుంటే. దర్శకుడు నితిన్ కృష్ణమూర్తికి డెబ్యూ మూవీ.
మొన్న శుక్రవారం రిలీజై మంచి వసూళ్లతో దూసుకుపోతోంది. అంతగా ఇందులో ఏముందయ్యా అంటే యూత్ ని ఆకట్టుకునే క్రైమ్ కామెడీ. హాస్టల్ రూంలో ఉండే స్టూడెంట్ కుర్రాళ్ళలో ఒకడికి షార్ట్ ఫిలిం తీయాలని ఉంటుంది. కానీ పరీక్షల వల్ల మిగిలినవాళ్లు వద్దంటారు. ఓరోజు హఠాత్తుగా వార్డెన్ శవం దొరుకుతుంది. తన చావుకు వీళ్ళే కారణమంటూ ఆ అయిదుగురు అబ్బాయిల పేర్లు రాసిన సూసైడ్ నోట్ కనిపిస్తుంది. దీంతో ఈ గండం నుంచి బయటపడేందుకు సీనియర్ సహాయం కోరతారు.ఆ తర్వాత జరిగే ట్విస్టులు, షాకులు, సస్పెన్సుల పరిణామ క్రమమే అసలు స్టోరీ.
దీన్ని సమర్పించింది రక్షిత్ శెట్టి. చిన్న క్యామియో కూడా చేశాడు . ఎలాంటి అసభ్యత లేకుండా చక్కని హాస్యంతో నవ్విస్తూనే హాస్యాన్ని పంచిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇక్కడ బేబీకి ఎలాగైతే పట్టం దక్కిందో అక్కడ హాస్టల్ హుడుగురు బేకాగిద్దరేకు యూత్ అండగా నిలబడ్డారు. ఆర్టిస్టులు పెర్ఫార్మన్స్ ఓ రేంజ్ లో పేలింది. కొంత హెచ్చు తగ్గులు ఉన్నప్పటికీ ఓవరాల్ గా నిక్షేపంగా టైం పాస్ చేయించింది. విరూపాక్ష, మంగళవారంలకు సంగీతం సమకూర్చిన అజనీష్ లోకానాధ్ మ్యూజిక్ మరో ఆకర్షణగా నిలుస్తోంది. తెలుగులో డబ్ లేదా రీమేక్ ఏదోటి జరగడం మాత్రం ఖాయం.
This post was last modified on July 24, 2023 8:56 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…