పండుగలు, వేడుకలు వచ్చినపుడు అల్లు అర్జున్ తన ఇద్దరు పిల్లల్ని భలేగా రెడీ చేయిస్తుంటాడు. మొన్న రాఖీకి, ఆ తర్వాత కృష్ణాష్టమికి అల్లు అయాన్, అల్లు అర్హ ఎలా తయారయ్యారో.. ఆ పండుగల్ని ఎలా సెలబ్రేట్ చేశారో తెలిసిందే. ఇప్పుడు స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని వీళ్లిద్దరూ స్వాతంత్ర్య సమర యోధుల వేషాలు వేశారు. మెగా కుటుంబంలో అలాంటి యోధుడి పాత్ర చేసింది మెగాస్టార్ చిరంజీవే. గత ఏడాదే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో ఆయన నటించిన ‘సైరా నరసింహారెడ్డి’ విడుదలైన సంగతి తెలిసిందే.
అందులో ఒక చోట.. ‘గెటౌట్ ఫ్రమ్ మై మదర్ ల్యాండ్’ అంటూ చిరు చెప్పే డైలాగ్ బాగా పాపులర్ అయిన సంగతి తెలిసిందే. అయాన్‌కు నరసింహారెడ్డి వేషం వేసి.. ఈ డైలాగే చెప్పించారు. చిరు మీద తన అభిమానాన్ని ఏదో రకంగా చాటుకోవడానికి బన్నీ ప్రయత్నిస్తూనే ఉంటాడు. ఈ క్రమంలోనే ఎందరో స్వాతంత్ర్య సమర యోధులుండగా.. ఉయ్యాలవాడ పాత్రను తన కొడుకుతో వేయించాడు. మరోవైపు అల్లు అర్హతో మరో స్వాతంత్ర్య సమర యోధుడు మదన్ మోహన్ మాలవ్య వేషం వేయించారు. తను ‘సత్యమేవ జయతే’ జయతే అంటూ చాలా క్యూట్‌గా అంది. ఈ రెండూ వీడియోలను ఒకదాని తర్వాత ఒకటి షేర్ చేశాడు బన్నీ. ఇవి మెగా అభిమానులను మురిపిస్తున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates