ఈ రోజుని మినహాయిస్తే బ్రో విడుదల ఇంకో నాలుగు రోజుల్లో జరగనుంది. ప్రత్యేకంగా టికెట్ రేట్లు, బెనిఫిట్ షోలకు అనుమతులు అడగమని నిర్మాత టిజి విశ్వప్రసాద్ ముందే చెప్పారు కాబట్టి ఏపీలో ఉదయం 7 గంటల కన్నా ముందే పడే ఛాన్స్ లేదని బయ్యర్లు అంటున్నారు. తెలంగాణలోనూ ప్రత్యేకంగా తెల్లవారుఝాము ప్రీమియర్ల మీద అనుమానాలైతే ఉన్నాయి. ఒకవేళ రెండు రాష్ట్రాల్లో ఒకటే టైం అనుకుంటే ఎవరేం చేయలేరు. తాజాగా బ్రో సెన్సార్ ఫార్మాలిటీ పూర్తి చేసుకుంది. కేవలం 2 గంటల 14 నిమిషాల 30 సెకండ్ల నిడివి మాత్రమే ఫైనల్ కట్ కి లాక్ చేసుకున్నారు.
ఈ మధ్య కాలంలో ఒక స్టార్ హీరో సినిమా ఇంత తక్కువ లెన్త్ లో రాలేదు. బేబీ సైతం మూడు గంటలకు దగ్గరగా ఉన్నా ప్రేక్షకులు విసుగు లేకుండా చూశారు. అలాంటిది పవన్ రేంజ్ హీరోకి రెండుంపావు అంటే చాలా తక్కువ. దీని వల్ల పెద్ద సౌలభ్యం ఉంది. షోలు త్వరగా పూర్తి చేసుకోవచ్చు. అయిదు ఆటలు వేసినా సెకండ్ షో తొమ్మిది లోపలే పడిపోతుంది. దీని వల్ల ఎక్కువ స్క్రీన్లున్న మల్టీప్లెక్సులకు ప్రయోజనం ఉంటుంది. ఏపీలో సింగల్ స్క్రీన్ 112 రూపాయలు, మల్టీప్లెక్స్ 145 నుంచి 177 మధ్యలో ఉండనుంది. తెలంగాణకు సంబంధించి రేపటిలోగా నిర్ణయం తీసుకుంటారు
బాక్సాఫీస్ వద్ద బేబీ తప్ప చెప్పుకోదగ్గ సినిమా ఏదీ లేదు కాబట్టి బ్రో కనక పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే చాలు రికార్డుల మోత ఖాయం. పవన్ స్క్రీన్ టైం తక్కువగా ఉన్నా మొదలైన పావు గంట నుంచి క్లైమాక్స్ దాకా ప్రతి ఫ్రేమ్ లోనూ ఉన్నట్టే అనిపిస్తుందని, గంటకు పైగానే పవర్ స్టార్ సీన్లు ఉంటాయని యూనిట్ చెబుతోంది. ఇక దర్శకుడు సముతిరఖని కాన్ఫిడెన్స్ ఏ స్థాయిలో ఉందంటే ఇది రిలీజయ్యాక ఏకంగా 12 భాషల్లో రీమేక్ కి ప్లాన్ చేసుకుంటానని చెబుతున్నారు. ట్రైలర్ లో చూపించిన త్రివిక్రమ్ డైలాగులు, పవన్ స్వాగ్ కనక కరెక్ట్ గా పేలితే బ్రోకి బ్లాక్ బస్టర్ ముద్రపడొచ్చు.
This post was last modified on July 24, 2023 6:14 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…