కంటెంట్ యువతకు కనెక్ట్ అయ్యేలా ఉండాలే కానీ క్యాస్టింగ్, బడ్జెట్, గ్రాఫిక్స్ ఇవేవి ఆడియన్స్ పట్టించుకోరని బేబీ మరోసారి ఋజువు చేసింది. రెండో వారంలో పదికి పైగా కొత్త రిలీజులున్నా సరే అవేవి తన దూకుడుని తగ్గించలేకపోయాయి. శుక్రవారం విడుదలైన వాటిలో దేనికీ యునానిమస్ హిట్ టాక్ రాకపోవడంతో ప్రేక్షకులకు మళ్ళీ బేబీనే ఫస్ట్ ఛాయస్ అయిపోయింది. మెల్లగా ఫ్యామిలీస్ కూడా వస్తుండటం విశేషం. నిన్న దాదాపు అన్ని ప్రధాన కేంద్రాల్లో ఒకటి రెండు షోలకు మినహాయించి అన్నీ హౌస్ ఫుల్స్ పడ్డాయి. కొన్ని చోట్ల సాయంత్రం అదనపు షోలు వేయాల్సి వచ్చింది.
నిన్న రెండో ఆదివారం ఒక్క రోజే సుమారు 3 కోట్ల 40 లక్షల షేర్ రావడమంటే మాటలు కాదు. ఇప్పటిదాకా ఏ మీడియం రేంజ్ మూవీకి టెన్త్ డే ఈ ఫిగర్స్ నమోదు కాలేదు. ఆ రకంగా చూస్తే బేబీకి మరో రికార్డు దక్కింది. నైజామ్ లో విపరీతంగా హైప్ తెచ్చుకున్న ఓపెన్ హెయిమర్, బార్బీ లాంటి రిలీజులున్నా కూడా 1 కోటి 60 లక్షలు రావడం మరో సంచలనం. క్రాస్ రోడ్స్ లో సెకండ్ షోకు లక్షకు పైగా వసూలు కావడం గురించి ఏం చెప్పాలి. ఇక పది రోజుల టోటల్ గ్రాస్ చూసుకుంటే 61 కోట్లకు పైగా రాగా ,షేర్ రూపంలో 32 కోట్ల దాకా జమైనట్టు ట్రేడ్ రిపోర్ట్.
కేవలం తొమ్మిది కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసుకున్న బేబీకి ఇది అనూహ్య విజయం. హీరో హీరోయిన్లతో పాటు టీమ్ మొత్తం సీడెడ్ సక్సెస్ టూర్ లో ఉంది. కలెక్షన్లకు ఎలాగూ ఇంకో వన్ వీక్ ఛాన్స్ దొరికింది కాబట్టి దాన్ని వాడుకోబోతున్నారు. 28న పవన్ కళ్యాణ్ బ్రో వచ్చాక దాని టాక్, రెస్పాన్స్ ని బట్టి బేబీ తిరిగి కొనసాగుతుందా లేక ఫైనల్ రన్ కు దగ్గరవుతుందా అనేది తేలుతుంది. మొత్తానికి బేబీ మాత్రం ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ అయిపోయింది. దీన్ని లైట్ తీసుకునోళ్లు, కొనకుండా వదిలేసినోళ్లు ఇప్పుడు తలలు పట్టుకుని తెగ బాధపడుతున్న మాట వాస్తవం.
This post was last modified on July 24, 2023 2:32 pm
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…