Movie News

ప్రపంచమంతా బార్బీ పెత్తనమే ఇండియాలో తప్ప

మొన్న 21వ తేదీ శుక్రవారం నువ్వా నేనా అన్నట్టు విడుదలైన హాలీవుడ్ సినిమాల్లో ఊహించని విధంగా బార్బీ పెత్తనమే నడిచింది. వరల్డ్ వైడ్ చూసుకుంటే 337 మిలియన్ డాలర్లతో నెంబర్ వన్ స్థానాన్ని తీసుకోగా క్రిస్టోఫర్ నోలన్ విజువల్ ట్రీట్ ఓపెన్ హెయిమర్ అందులో సగం కంటే తక్కువ 174 మిలియన్ డాలర్లతో సర్దిపుచ్చుకుంది. కానీ ఇండియాలో మాత్రం సీన్ రివర్స్ అయ్యింది. బార్బీకి మన దేశంలో 21 కోట్ల 50 లక్షల గ్రాస్ దక్కగా ఓపెన్ హెయిమర్ ఏకంగా 59 కోట్ల గ్రాస్ రాబట్టి నోలన్ కల్ట్ ఫాలోయింగ్ ఏ స్థాయిలో ఉందో వసూళ్ల సాక్షిగా నిరూపించింది.

అలా అని రెండు అత్యద్భుతమైన సినిమాలేం కావు. బార్బీ బాగానే ఉన్నా దాని రేంజ్ కి తగ్గ ఎగ్జైటింగ్ కంటెంట్ లేదని విమర్శకులు పెదవి విరిచారు. చిన్న పిల్లలు, యూత్ మాత్రం ఎగబడి చూస్తున్నారు. ఇక డాక్యుమెంటరీ స్టైల్ లో సాగిన ఓపెన్ హెయిమర్ ని ఎలాంటి గ్రాఫిక్స్ లేకుండా మూడు గంటలకు పైగా చూడటం వరల్డ్ ఆడియన్స్ భారంగా ఫీలవుతున్నారు. ఫిలిం మేకింగ్ ఎంత గొప్పగా ఉన్నా  సుదీర్ఘమైన సంభాషణలు సగటు ప్రేక్షకులను ఎంగేజ్ చేయలేకపోయాయి. పైగా బ్యాక్ డ్రాప్ ఎప్పుడో వరల్డ్ వార్ 2 నాటిది కాబట్టి సహజంగానే క్రేజీ యూత్ కి ఈ కాన్సెప్ట్ ఎక్కడం లేదు.

వీటికన్నా ముందు వచ్చిన టామ్ క్రూజ్ మిషన్ ఇంపాజిబుల్ 7 మధ్యలో క్రష్ అయిపోయింది. మొదటి ఆరు భాగాల స్థాయిలో ఇది లేకపోవడం కొంత నిరాశ పరచగా రెండు భాగాలుగా డెడ్ రికానింగ్ ని తీయడం ప్రభావం చూపించింది. అయితే మల్టీప్లెక్సుల్లో ఈ మూడు గొప్ప ఆదరణ దక్కించుకున్నాయి. బార్బీ, ఓపెన్ హెయిమర్ లు హిందీ తప్ప ఇతర భాషల్లో డబ్బింగ్ చేయకపోయినా సౌత్ లోనూ బాగా ఆడుతున్నాయి. ఈ వారం పవన్ కళ్యాణ్ బ్రో వచ్చేస్తుంది కాబట్టి వీటి తాకిడి తగ్గనుంది. అప్పటిదాకా కాదు కానీ సోమవారం నుంచే పై మూడు ఇంగ్లీష్ సినిమాల బుకింగ్స్ గణనీయంగా తగ్గిపోయాయి.

This post was last modified on July 24, 2023 2:13 pm

Share

Recent Posts

దర్శకుడికి రిలీఫ్.. సినిమాకు రిలీజ్ డేట్

మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్ చిత్రాలతో తెలుగులో మంచి ఫాలోయింగ్ సంపాదించాడు మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్. ఇప్పుడు అతడికి…

8 hours ago

యూట్యూబర్ వైష్ణ‌వి భ‌ర్త‌ను న‌డిరోడ్డుపై న‌రికి చంపారు

యూట్యూబ్ వీడియోల ద్వారా చాలా చిన్న వ‌య‌సులోనే మంచి పాపులారిటీ సంపాదించిన వైష్ణ‌వి అనే తెలంగాణ అమ్మాయి ఈ ఏడాది…

8 hours ago

రాకా 37.. ఏమిటబ్బా?

అల్లు అర్జున్ ఒక కొత్త సినిమా మొదలుపెట్టాడు అంటే ప్రమోషన్ల పరంగా మొదట్నుంచి బాగా హడావుడి ఉంటుంది. రెగ్యులర్‌గా అప్‌డేట్స్…

9 hours ago

ఒక్క‌డై వ‌చ్చి.. ఒంట‌రిగా.. ఆళ్ల నాని ఫ్యామిలీ పాలిటిక్స్ ఎండ్‌..!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ముఖ్యంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న ఆళ్ల కాళీకృష్ణ…

9 hours ago

ఎఫ్ బీఐని ఏపీ పోలీసులు దుర్వినియోగం చేశారు: జగన్

అమెరికా ఎఫ్‌బీఐ పేరుతో సోషల్ మీడియా పోస్టుల తొలగింపునకు ఎక్స్ కు అభ్యర్థనలు పంపారని ఏపీ పోలీసులపై, ఎన్డీఏ ప్రభుత్వంపై…

10 hours ago

దసరా క్లాష్…..సీనియర్ VS జూనియర్

వాయిదాల పుకార్లు ఎన్ని తిరుగుతున్నా మా పని మాదే అన్న తరహాలో దసరా విడుదలని టార్గెట్ చేసుకున్న రెండు ప్యాన్…

12 hours ago