Movie News

మీనాక్షి.. దశ తిరిగినట్లుందే

అందాల సుంద‌రి కిరీటాలు ద‌క్కించుకున్న వాళ్ల చూపంతా ప్ర‌ధానంగా బాలీవుడ్ మీదే ఉంటుంది. కానీ మాజీ మిస్ ఇండియా, హ‌రియాణా అమ్మాయి మీనాక్షి చౌద‌రి చూపు మాత్రం టాలీవుడ్ మీద ప‌డింది. అక్కినేని ఫ్యామిలీ కుర్రాడు సుశాంత్‌తో క‌లిసి చేసిన ఇచట వాహ‌న‌ములు నిలుప‌రాదు తెలుగులో త‌న తొలి చిత్రం. ఆ సినిమా నిరాశ ప‌రిచిన‌ప్ప‌టికీ.. ఈ అందాల సుంద‌రికి టాలీవుడ్లో అవ‌కాశాలు ఆగిపోలేదు.

ఖిలాడి, హిట్-2 లాంటి చిత్రాల‌తో ఆమె మంచి గుర్తింపే సంపాదించింది. దీంతో ఆమె కెరీర్ ఊపందుకుంది. ఇటీవ‌లే సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు స‌ర‌స‌న గుంటూరు కారం సినిమాలో అవ‌కాశం ద‌క్క‌డం మీనాక్షి కెరీర్‌లో గొప్ప మ‌లుపు.  త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో పూజా హెగ్డేను త‌ప్పించి మ‌రీ ఆమెకు ఛాన్స్ ఇచ్చారు.

మ‌హేష్ స‌ర‌స‌న సెకండ్ హీరోయిన్‌గా చేసినా స‌రే.. మీనాక్షి కెరీర్‌కు మంచి ఊపు వ‌స్తుంద‌న‌డంలో సందేహం లేదు. ఈ ఛాన్స్ ద‌క్కిన కొన్ని రోజుల్లోనే మ‌రో క్రేజీ మూవీలో అవ‌కాశం అందుకుంది మీనాక్షి. వ‌రుణ్ తేజ్ హీరోగా క‌రుణ్ కుమార్ రూపొందించ‌నున్న కొత్త చిత్రంలో మీనాక్షినే క‌థానాయిక‌గా ఎంచుకున్నారు. ఇది కాక విశ్వ‌క్సేన్ కొత్త సినిమాలోనూ మీనాక్షి క‌థానాయిక‌గా న‌టిస్తోంది.

అంటే వ‌చ్చే ఏడాది గుంటూరు కారం స‌హా మూడు చిత్రాల‌తో మీనాక్షి ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతోంద‌న్న‌మాట‌. ఆమె ఆల్రెడీ త‌మిళంలోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. ఇటీవ‌లే రిలీజైన హ‌త్య సినిమాలో ప్ర‌ధాన పాత్ర పోషించింది. ఈ సినిమా నెగెటివ్ టాక్ తెచ్చుకున్న‌ప్ప‌టికీ మీనాక్షి పెర్ఫామెన్స్ ఆక‌ట్టుకుంది. క‌థ మొత్తం త‌న చుట్టూనే తిరిగే సినిమాలో త‌న ప్ర‌త్యేక‌త‌ను చాటుకుంది. చూస్తుంటే మీనాక్షి రాబోయే రోజుల్లో పెద్ద రేంజికి వెళ్లేలా క‌నిపిస్తోంది.

This post was last modified on July 24, 2023 10:40 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

భీమ్స్….ఇలాగే సానబడితే దూసుకెళ్లొచ్చు !

టాలీవుడ్ లో సంగీత దర్శకుల కొరత గురించి చెప్పనక్కర్లేదు. తమన్, దేవిశ్రీ ప్రసాద్ ని అందరూ తీసుకోలేరు. పైగా వాళ్ళు…

1 hour ago

రిటైర్ అయ్యాక భారత్ కు కోహ్లీ వీడ్కోలు?

టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ తన ఆటతో మాత్రమే కాకుండా వ్యక్తిగత జీవితంతో కూడా నిత్యం వార్తల్లో నిలుస్తున్నాడు.…

8 hours ago

ఆ కేసుపై రేవంత్ కు కేటీఆర్ సవాల్

2023లో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఫార్ములా ఈ-కార్ రేసింగ్ వ్యవహారంలో స్కామ్ జరిగిందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్న…

8 hours ago

ఆచితూచి మాట్లాడండి..మంత్రులకు చంద్రబాబు సూచన

ఈ టెక్ జమానాలో ఆడియో, వీడియో ఎడిటింగ్ లు పీక్ స్టేజికి వెళ్లిన సంగతి తెలిసిందే. ఇక, ఏఐ, డీప్…

10 hours ago

పుష్ప టూ 1500 నాటవుట్ – రెండు వేల కోట్లు సాధ్యమా ?

పుష్ప 2 ది రూల్ మరో అరుదైన రికార్డుని సొంతం చేసుకుంది. కేవలం రెండు వారాలకే 1500 కోట్ల గ్రాస్…

11 hours ago