కల్కి 2898 ఏడీగా పేరు మార్చుకున్న ప్రాజెక్ట్ కే సినిమా నుంచి ఇటీవలే రిలీజైన టీజర్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ప్రభాస్ ఫస్ట్ లుక్ చూసి ట్రోల్ చేసిన వాళ్లంతా.. టీజర్ చూసి ముక్కున వేలేసుకున్నారు. సినిమాకు ముందున్న హైప్ తిరిగి వచ్చేసినట్లు అయింది. ఐతే టీజర్ చూసిన వాళ్లందరినీ ఒక సందేహం వెంటాడింది. ఇంతకీ సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడన్నదే ఆ డౌట్.
దర్శక ధీరుడు రాజమౌళి సైతం ఇదే సందేహం వ్యక్తం చేశాడు. కానీ దీనిపై చిత్ర బృందం మౌనమే వహిస్తోంది. ఐతే కల్కి 2898 ఏడీ రిలీజ్ డేట్‌పై ఆ చిత్ర బృందంతో సన్నిహిత సంబంధాలున్న సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ క్లారిటీ ఇచ్చాడు. ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్- మే నెలల్లో రిలీజయ్యే అవకాశమున్నట్లు ఓ ఇంటర్వ్యూలో ఆయన వెల్లడించాడు.
ప్రాజెక్ట్-కేను వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేయాలని ముందు అనుకున్నారు. ఆ మేరకు చాలా ముందే డేట్ కూడా ఇచ్చారు. కానీ ఈ భారీ చిత్రాన్ని ఆ సమయానికి రెడీ చేయడం అసాధ్యం అని తేలిపోయింది. అధికారికంగా వాయిదా నిర్ణయాన్ని ప్రకటించలేదు కానీ.. సంక్రాంతికి సినిమా రాదన్నది స్పష్టం. తమ్మారెడ్డి మాటలు చూస్తే నమ్మదగ్గట్లే ఉన్నాయి. ఆయన సినిమా షూటింగ్ ఎప్పుడు పూర్తవుతుందో.. ప్రస్తుత స్టేటస్ ఏంటో కూడా చెప్పారు. సినిమాను రెండు భాగాలుగా తీయబోతున్నట్లు ఇప్పటికే క్లారిటీ వచ్చేసిన సంగతి తెలిసిందే.
ఫస్ట్ పార్ట్‌కు సంబంధించి ఇంకో 40 రోజుల షూట్ బ్యాలెన్స్ ఉందని.. సెప్టెంబరులో కొత్త షెడ్యూల్ మొదలుపెట్టి మిగతా టాకీ పార్ట్ పూర్తి చేస్తారని.. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ అంతా అవగొట్టి వచ్చే వేసవిలో ఫస్ట్ పార్ట్ రిలీజ్ చేస్తారని తమ్మారెడ్డి వెల్లడించారు. ఇందులో విలన్ పాత్ర చేస్తున్న కమల్ హాసన్ ఇంకా షూట్‌కు రానే లేదని.. కొత్త షెడ్యూల్లో ఆయన జాయిన్ అవుతారని.. ఆయన పాత్ర పూర్తి స్థాయిలో సెకండ్ పార్ట్‌లోనే ఉంటుందని ఆయన తెలిపారు.
This post was last modified on July 24, 2023 9:40 am
స్థానిక సంస్థలు ఎన్నికల్లో ఏకగ్రీవాలు చేసుకునేందుకు కూటమి ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 70% స్థానిక…
రాష్ట్రంలో గొడ్డలి పార్టీ అనగానే ప్రతి ఒక్కరికీ వైసీపీ పార్టీ గుర్తుకు వస్తుంది. మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి…
పెద్ద దర్శకులు కొందరు తమ టెక్నీషియన్ల విషయంలో చాలా పర్టికులర్‌గా ఉంటారు. తమతో బాగా సింక్ అయ్యే, కోరుకున్న ఔట్…
సూపర్ స్టార్ రజినీకాంత్‌కు తెలుగులో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక్కడి పెద్ద హీరోలకు ఏమాత్రం…
ఈ మధ్యకాలంలో హిట్ అండ్ రన్ కేసులు ఎక్కువవుతున్నాయి. ఇక, కొందరు డబ్బున్న బడాబాబుల పిల్లలు, కొందరు రాజకీయ నాయకుల…
‘రామాయణం’ రెండు భాగాలకు కలిపి రూ.4 వేల కోట్ల బడ్జెట్ పెట్టినట్లు దాని నిర్మాత నమిత్ మల్హోత్రా ప్రకటించినపుడు అందరికీ…