‘శతమానం భవతి’ చిత్రంతో జాతీయ అవార్డు అందుకున్న దర్శకుడు సతీష్ వేగేశ్న ఇప్పుడు ఒక యూత్ ఫుల్ ఎంటర్టైన్ మెంట్ చిత్రానికి శ్రీకారం చుట్టబోతున్నారు. ఇందులో ఇద్దరు కథనాయకులుగా గా గ్రేట్ యాక్టర్ డా.శ్రీహరి తనయుడు మేఘామ్ష్ శ్రీహరి, వేగేశ్న సతీష్ తనయుడు సమీర్ వేగేశ్న నటించనున్నారు.

ఈ చిత్రాన్ని ‘లక్ష్య ప్రొడక్షన్స్’ బ్యానర్ పై MLV సత్యనారాయణ (సత్తిబాబు) నిర్మించనున్నారు. నేడు దివంగత డా.శ్రీహరి గారి జయంతి సందర్భంగా ఈ సినిమాను ప్రకటించారు.
ఈ సందర్భంగా దర్శకుడు సతీష్ మాట్లాడుతూ “వరుసగా కుటుంబ కథా చిత్రాలు చేసాను. ఇప్పుడు ఓ మంచి పూర్తి స్థాయి వినోదభరితమైన సినిమా చేయబోతున్నాను. ప్రస్తుతానికి ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తయింది. అన్ని పరిస్థితులు చక్కబడిన వెంటనే షూటింగ్ మొదలు పెడతాం” అని తెలిపారు.

నిర్మాత MLV సత్యనారాయణ (సత్తిబాబు) మాట్లాడుతూ ” సతీష్ గారు తీసిన ‘శతమానం భవతి’ చిత్రం నా మనసుకి బాగా నచ్చింది. ఇప్పుడు ఆయనతో సినిమా చేయడం సంతోషంగా ఉంది. హీరోయిన్స్ మరియు ఇతర సాంకేతికనిపుణుల వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates