గుంటూరు కారంలో కథేంటో కానీ అంతకు మించిన సస్పెన్స్ థ్రిల్ టీమ్ లో జరుగుతోంది. ఛాయాగ్రహణం నుంచి పీఎస్ వినోద్ తప్పుకుని ఆ బాధ్యతను రవి కె చంద్రన్ తీసుకున్నారనే వార్త నిన్నంతా మీడియాని ఊపేసింది. యూనిట్ అఫీషియల్ గా కన్ఫర్మ్ చేయకపోయినా గతంలో వచ్చిన ఇలాంటి వార్తలన్నీ నిజమే అయ్యాయి. తాజాగా తమన్ కు సంబంధించి మరో హాట్ న్యూస్ కొత్త అనుమానాలకు తెరలేపుతోంది. తను ఇచ్చిన ట్యూన్స్ ఏవీ మహేష్ కు నచ్చలేదని అయినా త్రివిక్రమ్ రికమండేషన్ మీద ఇప్పటిదాకా నెట్టుకుంటూ వచ్చారని నిన్నటి దాకా ఉన్న వార్త.
లేటెస్ట్ అప్ డేట్ ఏంటంటే చేతిలో టైం అయిపోతోంది. సర్దుబాట్లకు, బుజ్జగింపులు సమయం లేదు. అందుకే తమన్ స్థానంలో ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్లను పెట్టే ప్రతిపాదన తెరపైకి వచ్చినట్టు ఇంటర్నల్ లీక్. దాని ప్రకారం నాలుగు పాటలు హేశం అబ్దుల్ వహాబ్, రెండు మాస్ సాంగ్స్ భీమ్స్ సిసిరిలియోకి ఇచ్చే ప్రపోజల్ ని మహేష్ ముందు ఉంచినట్టు తెలిసింది. అయితే తన అంగీకారం వచ్చేది లేనిది విదేశాల్లో ఫోన్ ద్వారా డిసైడ్ చేస్తారట. కానీ తమన్ తో సహా ఎవరూ నోరు మెదపడం లేదు. బ్రో రీ రికార్డింగ్ లో బిజీగా ఉండటం వల్ల ఇప్పటికిప్పుడు క్లారిటీ వచ్చే అవకాశం లేదు.
ఒకవేళ నిజమైనా మంచిదే అనుకోవాలి. ఎందుకంటే హేశం మెలోడీకి, భీమ్స్ మాస్ కు పర్ఫెక్ట్ ఛాయస్ అవుతారు. పెద్ద హీరో సినిమా కాబట్టి తమలో బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తారు. అయితే గతంలో మహేష్ మూవీకి ఎన్నడూ ఇలాంటి పరిస్థితి రాలేదు. గుంటూరు కారం గురించి బయట ఎన్ని ప్రచారాలు జరుగుతున్నా, అభిమానుల్లో ఇది నెగటివిటీకి దారి తీస్తున్నా నిర్మాత నాగవంశీ మాత్రం సైలెంట్ గానే ఉన్నారు. సాధారణంగా ట్వీట్ రూపంలో బదులిచ్చే ఆయన మౌనవ్రతం పాటించారంటే ఏదో ఉండే ఉంటుంది. ఆగస్ట్ 9 మహేష్ బర్త్ డే ఉన్న నేపథ్యంలో వీలైనంత త్వరగా దీన్ని తేల్చేయాలి
This post was last modified on July 23, 2023 11:19 am
పార్లమెంట్ లో అధికార, ప్రతిపక్ష కూటములకు చెందిన ఎంపీల మధ్య ఉద్రిక్తత తారస్థాయికి చేరింది. ఈ ఘటనలో బీజేపీ ఒడిశా…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ మొదటి షెడ్యూల్ ని…
పార్లమెంటులో బీఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతోన్న సంగతి…
దేశ చరిత్రలో.. ముఖ్యంగా ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా పరిఢవిల్లుతున్న భారత దేశంలో తొలిసారి ఎవరూ ఊహించని ఘటన..…
పుష్ప 2 ది రూల్ ర్యాంపేజ్ అయ్యాక బాక్సాఫీస్ వద్ద మరో ఆసక్తికరమైన సమరానికి తెరలేస్తోంది. క్రిస్మస్ ని టార్గెట్…
బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలపై…