Movie News

రానా అదరగొట్టేశాడు

దగ్గుబాటి రానా సినిమా ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకమైనది. అతను పెద్ద సినిమా ఫ్యామిలీ నుంచి వచ్చినా.. అందరు వారసుల్లా మాస్ ఇమేజ్ కోసం తపించలేదు. వైవిధ్యమైన ప్రయాణమే చేశాడు. ‘లీడర్’ లాంటి వైవిధ్యమైన సినిమాతో హీరోగా పరిచయం అయిన రానా.. ఆ తర్వాత కథానాయకుడిగా చేసిన కొన్ని సినిమాలు నిరాశ పరిచినా.. డౌన్ అయిపోలేదు. క్యారెక్టర్, విలన్ రోల్స్ చేయడానికి రెడీ అయ్యాడు. ఆ క్రమంలోనే ‘బాహుబలి’ అతడి కెరీర్‌ను గొప్ప మలుపు తిప్పింది. ఆ తర్వాత మరెన్నో ప్రత్యేకమైన పాత్రలతో తన విశిష్టతను చాటుకుంటున్నాడు. ఇక సినిమా వేడుకలు, ఇంకేదైనా వేదికల్లో రానా మాట్లాడే తీరు అందరినీ మెప్పిస్తుంటుంది.

ఏమాత్రం ఇగోకు పోకుండా.. బేషజాలు లేకుండా కనిపిస్తాడు మాట్లాడతాడు. పెద్ద పెద్ద సినిమా వేడుకల్లో హోస్ట్‌గా కూడా అతను ఆకట్టుకున్నాడు. తన పరిజ్ఞానం, భాష అన్నీ కూడా మెప్పిస్తాయి. నిన్న అమెరికాలో ‘కామిక్ కాన్’ ఫిలిం ఫెస్టివల్ వేదిక మీద కూడా రానా తన ప్రత్యేకతను చాటుకున్నాడు. ఈ కార్యక్రమయంలో ‘ప్రాజెక్ట్-కే’ టీంతో పాటు రానా ఇండియన్ రెప్రజెంటేషన్ ఇచ్చారు. ఇక్కడ మొత్తం లీడ్ తీసుకుని ఆ కార్యక్రమాన్ని నడిపించింది రానానే. హాలీవుడ్ ప్రముఖుల ముందు.. ప్రపంచమంతా చూస్తుండగా.. ఇలాంటి ఒక కార్యక్రమాన్ని హోస్ట్ చేయడం అంటే మాటలు కాదు.

ఏమాత్రం తేడా వచ్చినా నవ్వులు పాలు అవుతారు. కానీ రానా మాత్రం ఏమాత్రం తడబడలేదు. ప్రాజెక్ట్-కే గురించే కాక భారతీయ సంస్కృతి, మన సినిమాల విశిష్టతను చాటేలా ఈ కార్యక్రమాన్ని డిజైన్ చేసి.. ప్రెజెంట్ చేసిన విధానం అందరినీ ఆకట్టుకుంది. ఇండియన్స్ ప్రౌడ్‌గా ఫీలయ్యేలా ఇండియన్ రెప్రజెంటేషన్ ఇచ్చింది టీం. ఈ విషయంలో మేజర్ క్రెడిట్ రానాకే చెందుతుంది. అలాగే ప్రాజెక్ట్-కే టీం కూడా బలమైన ముద్ర వేసింది. ఆ సినిమాకు కూడా వరల్డ్ లెవెల్లో మంచి ప్రమోషన్ దక్కింది. 

This post was last modified on July 23, 2023 1:29 am

Share

Recent Posts

నటనలో కేర్‌టేకర్‌… జనం మెచ్చిన నానా పటేకర్

బాలీవుడ్ సుప్రసిద్ధ నటుడు నానా పటేకర్ కన్ను మూయడం ఇండస్ట్రీ వర్గాలను దిగ్భ్రాంతికి గురి చేసింది. 75 వయసులో చివరి…

33 minutes ago

ఇన్నేళ్ళ తర్వాత శ్రీమంతుడు రీమేకా?

కన్నడ ఫిలిం ఇండస్ట్రీలో తెరకెక్కినన్ని రీమేక్‌లు మరే భాషలోనూ వచ్చి ఉండవు అంటే అతిశయోక్తి కాదు. తెలుగు, తమిళంలో హిట్టయిన…

3 hours ago

లెజెండరీ నటుడు నానా పటేకర్ కన్నుమూత!

ప్రముఖ నటుడు నానా పటేకర్ గురువారం కన్నుమూశారు. గోవాలోని తన నివాసంలో తీవ్ర గుండెపోటుకు గురైన ఆయనను వెంటనే సమీపంలోని…

3 hours ago

‘రణబాలి’ నేర్చుకున్న ‘ప్యారడైజ్’ పాఠం

నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల క్రేజీ కాంబినేషన్లో వచ్చిన ‘ది ప్యారడైజ్’ సినిమాకు రిలీజ్ ముందు రోజు రాత్రి…

4 hours ago

ఖైదీకి గోల్డ్ మెడల్.. జైల్లోనే చదివి డిగ్రీలో టాప్‌!

కారాగారంలో శిక్ష అనుభవిస్తున్న వ్యక్తికి విద్యపై ఆసక్తి, పట్టుదల తోడైంది. దీంతో చదువులో అత్యుత్తమ ఫలితాలను సాధించి ఇతర ఖైదీలకు…

5 hours ago

చీరలో పరిగెత్తి చరిత్ర సృష్టించిన కవిత

జీవితం అన్నీ నేర్పిస్తుంది. కష్టాలు ఎలా జీవించాలో నేర్పిస్థాయి. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ కవిత కుమారి. జార్ఖండ్‌లోని రామ్‌గఢ్ జిల్లా,…

5 hours ago