నిన్న రిలీజైన పదికి పైగా కొత్త సినిమాల్లో హౌస్ ఫుల్ బోర్డులు దేనికైనా పడ్డాయా అంటే వచ్చే సమాధానం హాలీవుడ్ మూవీ ఓపెన్ హెయిమర్. క్లాసిక్ ఫిలిం మేకర్ క్రిస్టోఫర్ నోలన్ ఆవిష్కరించిన ఈ అద్భుతాన్ని చూసేందుకు ప్రేక్షకులు ఎగబడ్డారు. తెలుగు డబ్బింగ్ లేకపోవడం మన ఆడియన్స్ ని నిరాశ పరచగా ఇంగ్లీష్, హిందీ వెర్షన్లు మాత్రమే అందుబాటులోకి తెచ్చారు. ఇక కంటెంట్ విషయానికి వస్తే ఇదో పీరియాడిక్ డ్రామా. హైడ్రోజెన్ బాంబులను సృష్టించిన శాస్త్రవేత్తగా పేరు గాంచిన ఓపెన్ హెయిమర్ బయోపిక్ ఇది. థియేటర్ కు వెళ్లే ముందు దీనికి తగ్గట్టు ప్రిపేర్ కావడం అవసరం
కథా నేపథ్యం 1949 నుంచి 1954 మధ్య జరిగిన పరిణామాలను ఆధారంగా చేసుకుని అల్లుకున్నారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో మెక్సికో ఎడారిలో అమెరికా అణుబాంబులు తయారు చేసే ప్రాజెక్టుని మొదలుపెడుతుంది. దాని కోసం ఓపెన్ హెయిమర్ ని తీసుకొస్తారు. ఇది ఎంతటి వినాశనం కోసం ఉద్దేశించిందో ముందుగా ఊహించని ఈ సైన్ టిస్ట్ తర్వాత జరిగే రాజకీయ చదరంగంలో పావుగా నిలవాల్సి వస్తుంది. ఆ విధ్వంసం తాలూకు పరిణామాలకు బాధితుడిగా మారాల్సి వస్తుంది. ఇదే ఈ మూవీలోని మెయిన్ పాయింట్. నోలన్ దీన్ని డాక్యుమెంటరీ స్టయిల్ లో రూపొందించారు.
ఇందులో మతిపోయే యాక్షన్ బ్లాక్స్ కానీ థ్రిల్ ఇచ్చే ఎపిసోడ్స్ కానీ ఏమీ ఉండవు. నోలన్ ప్రతిభకు పట్టం కట్టే టేకింగ్, గ్రాఫిక్స్ లేని అత్యున్నత సాంకేతికత, సంగీతం, నటీనటుల పెర్ఫార్మన్స్ మాత్రమే ఓపెన్ హెయిమర్ నుంచి ఆశించాలి. సుదీర్ఘమైన సంభాషణలు, కొంత భాగం బ్లాక్ అండ్ వైట్ లో చూసేందుకు సిద్ధపడితే తప్ప మూడు గంటల నిడివి ఉన్న ఈ డాక్యుడ్రామాని తట్టుకోవడం కష్టం. క్రిస్టోఫర్ నోలన్ ఫ్యాన్స్ ఆస్వాదిస్తారు కానీ సగటు ఆడియన్స్ కి కొరుకుడు పడని అంశాలు, అర్థం కాని విషయాలు ఎన్నో ఉన్నాయి. రెగ్యులర్ హాలీవుడ్ ప్యాట్రన్ ని ఆశిస్తే మాత్రం ఓపెన్ హెయిమర్ మీ ఛాయస్ కాబోదు.
This post was last modified on July 22, 2023 2:53 pm
కంటెంట్ కన్నా ముఖ్యం ఏది కాదనేది ఎప్పటికప్పుడు బాక్సాఫీస్ నిరూపిస్తునే ఉంటుంది. కాకపోతే కొందరు దర్శకులు తెలుసుకుంటారు, మరికొందరు తెలుసుకునేలోపే…
కాంబినేషన్ మత్తులో ఇప్పటికీ చాలా మంది ప్రొడ్యూసర్లు, దర్శకులున్నారు. ప్రాక్టికల్ గా క్షేత్ర స్థాయిలో ప్రేక్షకులు ఎలా అప్డేట్ అయ్యారో…
నన్ను ఆంధ్రా బిడ్డగా భావించండి. ఈ అందమైన రాష్ట్రాభివృద్ధికి నావంతుగా ఏం చేయాలో... ఎలా సేవ చేయాలో గైడెన్స్ ఇవ్వండని…
తమిళనాడు సీఎం విజయ్ రీల్ లైఫ్ సీఎం మాదిరి చేస్తున్న కొన్ని పనులు ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. తన డ్రైవర్…
వైఎస్ వివేకా మర్డర్ కేసు విచారణ వైసీపీ హయాంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నరీతిలో సాగిందని వివేకా తనయురాలు…
గత నెల సెప్టెంబర్ 18 హనుమాన్ అంశ్ తెలుగు డబ్బింగ్ విడుదల చేయడానికి ఏర్పాట్లు చేసుకుని ఆ మేరకు ప్రకటన…