వారం కిందట విడుదలైన బేబి అనే చిన్న సినిమా రిలీజ్ ముందు రోజు ప్రిమియర్స్ నుంచే సంచలనం రేపిన సంగతి తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆ చిత్రానికి పెద్ద సంఖ్యలో పెయిడ్ ప్రిమియర్స్ వేస్తే.. అవన్నీ కూడా హౌస్ ఫుల్ అయిపోయాయి. ఇక రిలీజ్ రోజు అయితే బేబి థియేటర్లలో మామూలు సందడి లేదు. ఒక చిన్న సినిమాకు తొలి రోజు ఇలాంటి సందడి అరుదు.
వీకెండ్లో ఆ చిత్రం వసూళ్ల మోత మోగించి.. మూడో రోజుకే దాదాపుగా అందరు బయ్యర్లనూ సేఫ్ జోన్లోకి తెచ్చేసింది. అక్కడి నుంచి బయ్యర్లకు వస్తున్నదంతా లాభమే. అప్పటికే సినిమాను మంచి లాభాలకు అమ్ముకున్న నిర్మాతలకు.. ఓవర్ ఫ్లోస్ రూపంలోనూ మరింత ఆదాయం వచ్చేలా కనిపిస్తోంది. బేబి వీకెండ్ తర్వాత కూడా ఏమాత్రం వీక్ అవ్వకుండా హౌస్ ఫుల్స్‌తో రన్ అవడం చూసి ట్రేడ్ వర్గాలు షాక్ అయ్యాయి.
మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలు కూడా మరీ ప్రభావం ఏమీ చూపించట్లేదు బేబి మూవీ మీద. ఈ సినిమా వసూళ్ల పరంగా ఒక్కో మైలురాయిని దాటుకుంటూ ముందుకు సాగుతోంది. వారం రోజుల్లోనే ఈ సినిమా ఏకంగా రూ.50 కోట్ల గ్రాస్ వసూళ్ల మైలురాయిని అందుకోవడం విశేషం. స్టార్ హీరోలు నటించని మిడ్ రేంజ్ చిత్రాల్లో ఇంత వేగంగా మరే సినిమా కూడా ఈ మైలురాయిని అందుకోలేదు.
అసలు బేబి లాంటి చిన్న సినిమా ఫుల్ రన్లో 50 కోట్లకు చేరువగా వస్తుందని కూడా ఎవరూ ఊహించలేదు. అలాంటిది వారం రోజుల్లో 50 కోట్లంటే ఆషామాషీ విషయం కాదు. ఈ సినిమా రెండో వీకెండ్లో కూడా బాక్సాఫీస్ లీడర్‌గా నిలుస్తోంది. ఈ వారం వచ్చిన తెలుగు సినిమాలేవీ దాని ముందు నిలబడే పరిస్థితి కనిపించడం లేదు. బ్రో మూవీ వచ్చేలోపు ఇంకో 20 కోట్లకు తక్కువ కాకుండా ఆ సినిమా కలెక్షన్లు కొల్లగొట్టే సంకేతాలు కనిపిస్తున్నాయి.
This post was last modified on July 22, 2023 11:59 am
తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్చార్జ్ శంకర్‌గౌడ్…
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…
సంక్రాంతి సీజన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన ది రాజా సాబ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఒక రకమైన…
సంక్రాంతి రేసులో రెండో పుంజు దిగుతోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ది రాజా సాబ్ ఫలితం మీద దాదాపు…