Movie News

క‌ల్కి డేట్ అడిగిన రాజ‌మౌళికి కౌంట‌ర్లే కౌంట‌ర్లు

క‌ల్కి 2898 ఏడీగా మారిన ప్రాజెక్ట్‌-కే సినిమా నుంచి తాజాగా రిలీజైన ఫ‌స్ట్ గ్లింప్స్ సోష‌ల్ మీడియాను ఊపేస్తోంది. ప్ర‌భాస్ ఫ‌స్ట్ లుక్ చూసి చిత్ర బృందంపై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించిన నెటిజ‌న్లు.. ఒక్క రోజు వ్య‌వ‌ధిలో త‌మ ఆలోచ‌న మార్చుకుని నాగ్ అశ్విన్ అండ్ టీంను కొనియాడుతున్నారు. ప‌క్కా ఇంట‌ర్నేష‌న‌ల్ మూవీలా క‌నిపిస్తున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది వ‌ర‌ల్డ్ వైడ్ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర సంచ‌ల‌నం రేప‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.

టీజ‌ర్ చూసి ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి సైతం అబ్బుర‌ప‌డ్డాడు. నాగి అండ్ టీం మీద ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించాడు. దీంతో పాటు చివ‌ర్లో చిన్న పంచ్ లైన్ లాంటిది పెట్టాడు జ‌క్క‌న్న‌. ఇక స‌మాధానం తెలియాల్సిన ప్ర‌శ్న ఒక్క‌టే అని.. అదే రిలీజ్ డేట్ ఎప్పుడు? అని రాజ‌మౌళి పేర్కొన్నాడు. ఈ ప్ర‌శ్న సోష‌ల్ మీడియాలో మంచి వినోదానికి తెర తీసింది.

రాజ‌మౌళి మీద ఆయ‌న సన్నిహితుల‌తో పాటు నెటిజ‌న్లు చాలామంది కౌంట‌ర్లు వేస్తున్నారు. స్వ‌యంగా బాహుబ‌లి నిర్మాత శోభు యార్ల‌గ‌డ్డ‌.. ఈ ట్వీట్‌పై స‌ర‌దాగా స్పందించారు. రిలీజ్ డేట్ గురించి అడుగుతున్న‌ది ఎవ‌రో చూశారా అని ఆయ‌న అన్నారు. దీనికి  రాజ‌మౌళి త‌న‌యుడు కార్తికేయ న‌వ్వుల ఎమోజీలు పెట్టాడు. రాజ‌మౌళి సినిమాలంటేనే రిలీజ్ డేట్ల విష‌యంలో ఎప్పుడూ క్లారిటీ ఉండ‌దు.

చెప్పిన డేట్‌కు క‌ట్టుబ‌డ‌టం రాజ‌మౌళికి చాలా సినిమాల నుంచి అల‌వాటు లేదు. ఈగ‌, బాహుబ‌లి-1, బాహుబ‌లి-2, ఆర్ఆర్ఆర్.. ఇలా ప్ర‌తి సినిమా కూడా డేట్ మార్చుకున్న‌దే. వాయిదాల మీద వాయిదాలు ప‌డ్డ‌దే. ఆర్ఆర్ఆర్ అయితే ఎన్నిసార్లు డేట్ మార్చుకుందో లెక్క లేదు. ఇలాంటి చ‌రిత్ర ఉన్న జ‌క్క‌న్న క‌ల్కి సినిమా  రిలీజ్ డేట్ గురించి అడ‌గ‌డంతో నెటిజ‌న్లు ఆయ‌న మీద కౌంట‌ర్లు వేస్తున్నారు. దీని మీద స‌ర‌దా కామెంట్లు, మీమ్స్ చాలానే క‌నిపిస్తున్నాయి.

This post was last modified on July 22, 2023 9:29 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఏపీలో.. టైం టేబుల్ పాల‌న‌!!

సాధార‌ణంగా ప్ర‌తి ప్ర‌భుత్వం త‌న ప‌ని తాను చేసుకుని పోతుంది. ప్ర‌జ‌ల‌కు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్ర‌ణాళిక‌లు.. కొన్ని…

3 hours ago

స‌లార్-1పై నిరాశ‌.. స‌లార్-2పై భ‌రోసా

బాహుబ‌లి-2 త‌ర్వాత వ‌రుస‌గా మూడు డిజాస్ట‌ర్లు ఎదుర్కొన్న ప్ర‌భాస్‌కు స‌లార్ మూవీ గొప్ప ఉప‌శ‌మ‌నాన్నే అందించింది. వ‌ర‌ల్డ్ వైడ్ ఆ…

9 hours ago

సినీప్రముఖుల ఇళ్ళపై రాళ్ల‌దాడి.. సీఎం రేవంత్ రియాక్ష‌న్!

ఐకాన్ స్టార్‌.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొంద‌రు వ్య‌క్తులు దాడికి దిగిన విష‌యం తెలిసిందే. భారీ ఎత్తున…

10 hours ago

తాతకు త‌గ్గ‌ మ‌న‌వ‌డు.. నారా దేవాన్ష్ `రికార్డ్‌`

ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌న‌వ‌డు, మంత్రి నారా లోకేష్‌, బ్రాహ్మ‌ణి దంప‌తుల కుమారుడు నారా దేవాన్ష్‌.. రికార్డు సృష్టించారు. ఇటీవ‌ల…

11 hours ago

అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి.. ఎవరి పని?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌లో కొంద‌రు ఆందోళ‌న కారుల‌ను పోలీసులు అరెస్టు…

14 hours ago

అల్లు అర్జున్‌కు షాక్‌.. వీడియో బ‌య‌ట పెట్టిన సీపీ

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మ‌రింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేట‌ర్ ఘ‌ట‌న‌పై ఇప్ప‌టికే ఏ11గా కేసు న‌మోదు…

14 hours ago