ఈ హైటెక్ జమానాలో స్మార్ట్ ఫోన్ల వాడకం పెరిగిపోయింది. చౌక ధరలో స్మార్ట్ ఫోన్లు, మొబైల్ డేటా ఇంటర్నెట్ అందుబాటులోకి రావడంతో యువత మొదలు పెద్దవాళ్ల వరకు అంతా స్మార్ట్ ఫోన్లకు చాలా సమయం అతుక్కుపోతున్నారు. ఈ క్రమంలోనే మనదేశంలో పోర్న్ చూసే వారి సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది. అయితే, కొందరు కామాంధులు పసిపిల్లల మొదలు ముసలి వాళ్ళ వరకు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. మరికొందరైతే ప్రేమ ముసుగులో యువతులకు ఆశ చూపి వారిని శారీరకంగా లోబరుచుకుంటున్నారు.
ఆ తర్వాత ఆ వీడియోలు చూపించి వారిని బ్లాక్ మెయిల్ చేయడం, పదేపదే అత్యాచారానికి పాల్పడడం వంటి ఘటనలు అనేకం చూస్తున్నాం. ఇక, ఇటువంటి బెదిరింపు వీడియోలు ఆన్లైన్లో రిలీజ్ చేస్తామంటూ లక్షలకు లక్షల డబ్బులు గుంజిన ఘటనలు అనేకం ఉన్నాయి. ఆ వీడియోలు బయటపడితే తమ పరువు పోతుంది అన్న ఉద్దేశంతో కొంతమంది మహిళలు ఆత్మహత్య చేసుకున్న ఘటనలు ఉన్నాయి. అయితే, ఇటువంటి ఘటనలు సామాన్యులకే కాదు సెలబ్రిటీలకు షాక్ ఇస్తున్నాయి.
తాజాగా కోల్ కతాలో ఓ బెంగాలీ యువనటికి ఈ తరహా బ్లాక్మెయిల్, వేధింపులు ఎదురయ్యాయి. ఆ యువనటి, మోడల్ ఇంట్లోనే ఆమెకు పరిచయం ఉన్న వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతేకాదు, జులై 5న జరిగిన ఘటనను ఆయన వీడియో తీసి ఆ హీరోయిన్ ను బెదిరించడం మొదలు పెట్టాడు. డబ్బులు అప్పు కావాలంటూ ఆమె ఇంటికి వెళ్లిన సదరు కామాంధుడు ఆమె ఒంటరిగా నివసిస్తుందన్న విషయం తెలుసుకొని ఆమెపై బలాత్కారానికి పాల్పడ్డాడు. ఈ విషయం బయటపెడితే ఆ వీడియోను పోర్న్ సైట్లో అప్లోడ్ చేస్తానని ఆమెను బెదిరించాడు.
దీంతో, మొదట భయపడ్డ ఆ హీరోయిన్ చివరకు ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే కేసు నమోదు చేసిన జాదవ పూర్ పోలీసులు ఈ కేసు విచారణ మొదలుపెట్టారు. వైద్య పరీక్షలు నిమిత్తం ఆమెను ఆసుపత్రికి తరలించారు. హీరోయిన్ పై ఇటువంటి లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన సంచలనం రేపింది.
This post was last modified on July 21, 2023 4:10 pm
2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీల కలయికలో ఏర్పడి ఎన్డీఏ కూటమి ఏపీలో ఘన విజయం సాధించింది. పార్టీ బలాబలాలు,…
తన పాత పాటలు ఏవైనా కొత్త సినిమాల్లో వాడుకుంటే అస్సలు ఊరుకోవట్లేదు లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా. నోటీసులు ఇస్తున్నారు.…
జాతీయ సినీ అవార్డులు ప్రకటించినపుడల్లా.. ఫలానా సినిమాకు అన్యాయం జరిగింది, ఫలానా ఆర్టిస్టుకు అవార్డు ఇవ్వాల్సింది అనే చర్చ జరగడం…
వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీకి వాడిన నెయ్యిలో కల్తీ జరిగిందని ఆరోపణలు రావడంతో సుప్రీం కోర్టు ఆధ్వర్యంలో సిట్…
ఈ రోజుల్లో ఓ పెద్ద సినిమా నుంచి ఒక చిన్న అప్డేట్ ఇవ్వాలంటే దానికి ఎంత హడావుడి చేస్తారో? అప్డేట్…
సెన్సెక్స్ మాదిరి బంగారం ధరలు రాకెట్ వేగంతో దూసుకెళుతున్న వైనం ఇటీవల కాలంలో చోటు చేసుకుంటుంది. ఉదయం ఉన్న ధర…