సరిగ్గా ఇంకో వారం రోజుల్లో బ్రో వచ్చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ – సాయి ధరమ్ తేజ్ తొలి కలయికగా ఇది అనౌన్స్ చేసిన టైంలో విపరీతమైన లెక్కలు, నమ్మకాలు ఏర్పడ్డాయి. తీరా రిలీజ్ సమయానికి అంచనాలు మితిమీరకుండా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ జాగ్రత్తగా చాలా లో ప్రొఫైల్ లో ప్రమోషన్లు చేస్తోంది. అభిమానులు ఈ విషయంగా అసంతృప్తిగా ఉన్నా రేపు ట్రైలర్ వచ్చాక అభిప్రాయాలు ఏమైనా మారతాయేమో చూడాలి. వినోదయ సితం రీమేక్ గా సముతిరఖని దర్శకత్వంలో రూపొందుతున్న బ్రోకు తమన్ మ్యూజిక్ పరంగా మాత్రం నెగటివ్ ఫీడ్ బ్యాకే తెచ్చుకుంది.
ఆదిపురుష్ కు బహిరంగంగా ప్రకటించినట్టు కాకుండా బిజినెస్ లెక్కలను ఈసారి నిర్మాత టిజి విశ్వప్రసాద్ ఓపెన్ గా బయట పెట్టలేదు. బయ్యర్లు సేఫ్ అయ్యేలా మంచి రేట్లకే ఇచ్చామని, బెనిఫిట్ షోలకు పర్మిషన్లు, టికెట్ రేట్ల పెంపు లాంటివి ఉండవని నొక్కి వక్కాణించారు. అంటే కంటెంట్ మీద ఎంత కాన్ఫిడెన్స్ ఉన్నా దాన్ని క్యాష్ చేసుకోవాలనే ఆత్రం లేదనే సందేశం డైరెక్ట్ గానే ఇచ్చారు. అసలే బ్రో రెగ్యులర్ కమర్షియల్ ఎంటర్ టైనర్ కాదు. ఫైట్లు గట్రా పెద్దగా ఉండవు. ఉన్న డ్యూయెట్ కూడా మేనల్లుడికే. పవన్ కేవలం పబ్బు సాంగ్, ఎమోషనల్ పాటకు మాత్రమే పరిమితం.
పోటీ లేదు కాబట్టి ఓపెనింగ్స్ పరంగా బ్రోకు ఎలాంటి ఇబ్బంది లేదు. యావరేజ్ అనిపించుకున్నా చాలు రికార్డుల మోత ఖాయం. ఒకవైపు ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ వైసిపితో ఉన్న రాజకీయ పోరాటం వల్ల విడుదల రోజు థియేటర్ల దగ్గర ఏమైనా ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయేమోనని డిస్ట్రిబ్యూటర్లు కొంత ఆందోళన చెందుతున్న మాట వాస్తవం. కేతిక శర్మ హీరోయిన్ గా, ప్రియా ప్రకాష్ వారియర్ తేజు చెల్లెలిగా నటిస్తున్న బ్రోలో పవర్ స్టార్ కి జోడి ఉండదు. పాటల సంగతి ఎలా ఉన్నా త్రివిక్రమ్ మార్కు డైలాగులు పంచులైతే బ్రోలో బోలెడు ఉంటాయట.
This post was last modified on July 21, 2023 10:03 am
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…