ఒక టాప్ హీరో ఓ పెద్ద సినిమాలో నటిస్తున్న సమయంలో బయట వేరే ఏ సినిమా వేడుకకు వచ్చినా.. అభిమానులు అతను చేస్తున్న సినిమాకు సంబంధించిన విశేషాలు పంచుకోవాలని గొడవ చేస్తుంటారు. ఆ వేడుక జరుగుతున్న సినిమా సైడ్ అయిపోయేలా ఉంటుంది వాళ్ల గొడవ. స్టార్ హీరోలు సాధ్యమైనంత వరకు తన సినిమా నుంచి అభిమానులను డీవియేట్ చేయడానికే ప్రయత్నిస్తారు. కానీ అల్లు అర్జున్ మాత్రం అలా కాకుండా అభిమానులు మరీ డిమాండ్ చేయకపోయినా.. తన కొత్త చిత్రం ‘పుష్ప-2’ నుంచి ఒక డైలాగ్‌ను లీక్ చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు.
అసలు ముందు తనకు ఆ డైలాగ్ లీక్ చేసే ఉద్దేశమే లేదంటూనే.. ‘పుష్ప-2’ నుంచి ‘‘ఈడంతా జరిగేదంతా ఒకటే రూల్ మీద జరుగుతా ఉండాది. పుష్ప గాడి రూల్’’ అనే డైలాగ్‌ను బన్నీ చెప్పి అభిమానులను అలరించాడు.
ఐతే సినిమాలో ఒకటే లైన్ ఉంటుంది అని చెబుతూ డైలాగ్ లీక్ చేస్తున్నాడంటే.. ఫస్ట్ పార్ట్‌లోని ‘‘తగ్గేదే లే’’ టైపులో ఏదైనా పంచ్ లైన్ చెబుతాడేమో అనుకున్నారు అభిమానులు. కానీ దానికి భిన్నంగా ఏదో డైలాగ్ చెప్పాడు బన్నీ. అదైతే మరీ కిక్కిచ్చేలా ఏమీ లేదు. జనాలు మరీ చర్చించుకునేంత బలమైన డైలాగ్ ఏమీ కాదది. సుక్కు మార్కు కూడా ఏమీ కనిపించని ఈ డైలాగ్ విషయంలో నెటిజన్లు మామూలుగానే స్పందిస్తున్నారు.
ఏదో అభిమానులకు కొంచెం ఉత్సాహాన్నివ్వడానికి ‘పుష్ప-2’ పేరు ఎత్తి డైలాగ్ చెప్పాడే తప్ప.. ఇది అందరూ ఆశ్చర్యపోయే లీక్ అయితే కాదు. కాబట్టి సుకుమార్ అండ్ కో కూడా పెద్దగా కంగారు పడట్లేదని తెలుస్తోంది. కానీ ఫస్ట్ పార్ట్‌లో మాదిరే ఇందులోనూ పవర్ ఫుల్ డైలాగులు.. సోషల్ మీడియాను ఊపేసే పాటలకు అయితే కొదవ లేదట. ఇప్పటికే దేవిశ్రీ ప్రసాద్ సినిమాకు సంబంధించి రెండు పాటలు కూడా రికార్డ్ చేసేసినట్లు సమాచారం.
This post was last modified on July 21, 2023 8:48 am
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో అరెస్టయి బెయిల్ పై విడుదలైన అల్లు అర్జున్ కు పోలీసులు తాజాగా మరో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా..ఆమె తనయుడు శ్రీతేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ…
తమిళ లెజెండరీ దర్శకుడు శంకర్ అంటే తెలుగు ప్రేక్షకులకే కాదు, ఇండస్ట్రీ జనాలకు కూడా ఆరాధన భావం. తన తొలి…
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…