ఏ హీరోకి జరగని విధంగా ప్రభాస్ ఫ్యాన్స్ కేవలం టీజర్ల కోసం అర్ధరాత్రి మేలుకోవడాలు, ఉదయాన్నే లేవడాలు జరుగుతున్నాయి. విపరీతమైన అంచనాల మధ్య దేశవ్యాప్తంగా మూవీ లవర్స్ విపరీతమైన ఎగ్జైట్ మెంట్ తో ఎదురుచూసిన ప్రాజెక్ట్ కె టైటిల్ రివీల్, టీజర్ రిలీజ్ రెండూ శాన్ డియెగోలో జరుగుతున్న కామ్ కాన్ ఫెస్టివల్ లో వందలాది విశిష్ట అతిథుల మధ్య గ్రాండ్ గా జరిగాయి. భారీ తెరపై విజువల్స్ చూస్తుండగానే అచ్చం అలాంటి పాత్రలనే సాంప్రదాయ పద్ధతిలో గెస్టుల మధ్య తీసుకురావడం ద్వారా సరికొత్త అనుభూతిని కలిగించారు నిర్వాహకులు.
ఇప్పటిదాకా ప్రచారం జరిగినట్టు ఇది ప్రాజెక్ట్ కె కాదు. కల్కి 2898 AD గా నామకరణం చేశారు. లైట్ గా కథేంటో రివీల్ చేసే ప్రయత్నం చేశారు. సరిగ్గా 875 సంవత్సరాల తర్వాత ప్రపంచం దుష్ఠశక్తుల కబంధ హస్తాల్లోకి వెళ్లి ప్రజల ప్రాణాలు ప్రమాదంలో పడినప్పుడు వాళ్ళను ఆదుకోవడానికి ఒక సూపర్ హీరో వస్తాడు. అతనే కల్కి(ప్రభాస్). దుర్భేదమైన శత్రువు కోటలను బద్దలు కొడుతూ నేనున్నానంటూ అభయమిస్తాడు. అసలు అంత సుదీర్ఘమైన భవిష్యత్తుకి మనం ఎందుకు వెళ్లాల్సి వచ్చిందనే ప్రశ్నకు సమాధానం తెలియాలంటే ఇంకొన్ని నెలల పాటు ఎదురు చూడాల్సిందే.
హాలీవుడ్ రేంజ్ విజువల్స్ తో దర్శకుడు నాగ అశ్విన్ ఒక డిఫరెంట్ ఎక్స్ పీరియన్స్ అయితే ఇచ్చాడు. డూన్ తరహా సెటప్ తో తానో ఊహాతీత లోకంలోకి తీసుకెళ్ళబోతున్న భావన కలిగించాడు. ఫస్ట్ లుక్ పోస్టర్ మీద వచ్చిన నెగటివిటీ తగ్గించేలా ఈ టీజర్ కట్ జరిగింది . దీపికా పదుకునేని రివీల్ చేయగా అమితాబ్ బచ్చన్ కళ్ళతో సరిపుచ్చారు. అంతర్జాతీయ సాంకేతిక నిపుణులు పనిచేస్తున్న కల్కికి సంతోష్ నారాయణన్ సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. సంక్రాంతికి రిలీజ్ అవుతుందని ఎదురు చూసిన ఫ్యాన్స్ కి ట్విస్టు ఇస్తూ విడుదల తేదీని మాత్రం ఇందులో ఖరారు చేయలేదు.
This post was last modified on July 21, 2023 8:43 am
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లిన.. ఆయ న సతీమణి నారా…