ప్రస్తుతం టాలీవుడ్ బాక్సాఫీస్‌లో సంచలనం రేపుతున్న చిత్రం.. బేబి. చిన్న సినిమాగా రిలీజై పెద్ద రేంజికి వెళ్తున్న ఈ చిత్రం ఇప్పటికే రూ.40 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది. వర్షాల ప్రభావంలో కూడా ఈ సినిమా నిలకడగా వసూళ్లు రాబడుతోంది. ఈ సినిమాలో కథ.. పాత్రలు చాలా ట్రెండీగా ఉండటం వల్ల.. రియలిస్టిగ్గా అనిపించడం వల్ల యూత్ బాగా కనెక్టవుతున్నారన్నది నిజం.
నిజానికి ఈ కథ కూడా పూర్తి కల్పితం ఏమీ కాదు. తమిళనాడులోని సేలంలో జరిగిన ఒక వాస్తవ ఉదంతం ఆధారంగా రైటర్ కమ్ డైరెక్టర్ సాయిరాజేష్ ఈ కథను తీర్చిదిద్దుకోవడం విశేషం. ఒక ఇంటర్వ్యూలో ఆయనే ఈ విషయాన్ని వెల్లడించారు. సేలంలో కొన్నేళ్ల కిందట ఒక అమ్మాయిని ఇద్దరు అబ్బాయిలు కలిసి కిరాతకంగా హత్య చేశారు. ఆ ఇద్దరూ ఆమెను ప్రేమించిన వాళ్లు కావడం విశేషం.
ఇంజినీరింగ్ చదివే ఒక అమ్మాయి తన క్లాస్ మేట్‌తోనే కాక.. ఒక ఆటోడ్రైవర్‌తో ఒకేసారి స్నేహం చేసింది. ప్రేమలోనూ పడింది. ఒకరికి తెలియకుండా ఒకరితో కొన్ని రోజులు కలిసి ప్రయాణం చేశాక.. అనుకోకుండా ఆ విషయం ఆ ఇద్దరు అబ్బాయిలకు తెలిసిపోయింది. దీంతో వాళ్లిద్దరూ కసితో రగిలిపోయి ఆ అమ్మాయిని దారుణంగా హత్య చేశారు. ఈ ఉదంతం గురించి తెలిసి.. హత్యకు సంబంధించి విజువల్స్ చూసి సాయిరాజేష్ కదిలిపోయారట.
అందులో హత్య అంశాన్ని పక్కన పెట్టి అమ్మాయి పర్సప్షన్ ఏమై ఉంటుంది అనే ఆలోచనతో ఆ ముగ్గురి పాత్రలనే తీసుకుని కథ అల్లుకున్నట్లు సాయిరాజేష్ తెలిపాడు. ఆ కథను ఉన్నదున్నట్లుగా తీస్తే సొసైటీకి చెడు సందేశం ఇచ్చినట్లుగా ఉంటుందనే ఉద్దేశంతోనే అమ్మాయిని అబ్బాయిలిద్దరూ చంపినట్లు చూపించలేదని.. కథనం.. పతాక ఘట్టం వేరే రకంగా చూపించానని సాయిరాజేష్ తెలిపాడు.
This post was last modified on July 20, 2023 2:46 pm
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…