ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న అత్యధిక బడ్జెట్ చిత్రం ప్రాజెక్ట్-కే. ఈ సినిమాపై అంచనాలు మామూలుగా లేవు. ప్రభాస్ హీరోగా మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ రూపొందిస్తున్న ఈ సినిమాకు సంబంధించి ప్రతిదీ విశేషంగా చెప్పుకుంటూ వచ్చారు అభిమానులు. సినిమా మొదలైన ఏడాది తర్వాత ఇప్పుడే ఈ చిత్రం నుంచి ప్రభాస్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఐతే అభిమానుల అంచనాలను కనీస స్థాయిలో కూడా ఈ ఫస్ట్ లుక్ అందుకోలేకపోయింది.
ఏదో అభిమానులు చేసే ఫేక్ ఎడిట్ తరహాలో ఉందంటూ ప్రభాస్ ఫస్ట్ లుక్ ఉందంటూ బుధవారం సాయంత్రం నుంచి సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ జరుగుతోంది. ప్రభాస్ ఫ్యాన్స్ అయితే ఈ లుక్ విషయంలో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కాగా.. ఈ ఫస్ట్ లుక్ విషయంలోట్రోలింగ్ కాస్త పొలిటికల్ కలర్ కూడా తీసుకోవడం గమనార్హం. ప్రభాస్ ఫస్ట్ లుక్ చూసి.. దర్శకుడు నాగ్ అశ్విన్‌ను తెలంగాణ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.
గతంలో తెలంగాణ సెక్రటేరియట్ డిజైన్ చూసి నాగ్ అశ్విన్ విమర్శలు గుప్పించాడు. ఈ డిజైన్ బాగా లేదని.. అంటే అది రాజకీయ కోణంలో కాదని, నిర్మాణ పరంగా ఆ డిజైన్ ఆకట్టుకునేలా లేదని… అవసరమైతే తాను మంచి ఆర్కిటెక్ట్‌లను సూచిస్తానని.. మనం మరింత మెరుగ్గా దీన్ని మార్చవచ్చని ట్వీట్ చేశాడు నాగి. ఇప్పుడు ఆ ట్వీట్‌ను గుర్తు చేసేలా తెలంగాణ నెటిజన్లు కౌంటర్లు వేస్తున్నారు. ప్రాజెక్ట్-కే ఫస్ట్ లుక్ బాగా లేదని.. అంటే అది రాజకీయంగా కాదని, సినిమా పరంగా అని.. అవసరం అయితే మంచి డిజైనర్లను తాము సూచిస్తామని.. ఫస్ట్ లుక్‌ను మరింత మెరుగ్గా మారుద్దామని.. అచ్చం నాగ్ అశ్వని్ స్టయిల్లోనే ట్వీట్లు వేస్తున్నారు తెలంగాణ నెటిజన్లు. నాగ్ అశ్విన్ అప్పుడు నిజాయితీగానే తన అభిప్రాయం చెప్పినా.. ఇప్పుడు మాత్రం దానికి తెలంగాణ నెటిజన్లు ప్రతీకారం తీర్చుకుంటున్నారు.
This post was last modified on July 20, 2023 11:12 am
కొన్ని సినిమాలంతే. మొదట్లో నెగటివ్ లేదా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటాయి. తర్వాతి కాలంలో కల్ట్ క్లాసిక్స్ గా మారిపోయి రీ…
గత ప్రభుత్వంలో కాకినాడ సీ పోర్టు.. సెజ్ చేతులు మారిన సంగతి తెలిసిందే. అయితే.. తన నుంచి బలవంతంగా పోర్టును…
ఈ మధ్య మన తెలుగు సినిమాలు జపాన్, చైనా లాంటి దేశాల్లో బాగా ఆడుతున్నాయి. ఆర్ఆర్ఆర్ కు దక్కిన ఆదరణ…
మానవాళి చరిత్రలో అనూహ్య ఘటన ఒకటి చోటు చేసుకోనుంది. మారథాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఐదు…
నారా లోకేశ్… ఇప్పటిదాకా మనకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, ఏపీ కేబినెట్ లో కీలక శాఖలను నిర్వహిస్తున్న మంత్రిగా……
అగ్ర రాజ్యం అమెరికాకు 47వ అధ్యక్షుడిగా ఆ దేశ ప్రముఖ వ్యాపారవేత్త డొనాల్డ్ జే ట్రంప్ రెండు రోజుల క్రితం…