ఇంకో ఎనిమిది రోజుల్లో విడుదల కాబోతున్న బ్రో కోసం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. సాధారణంగా పవర్ స్టార్ మూవీ వస్తున్నప్పుడు కనిపించే హంగామా ఆ స్థాయిలో లేదు కానీ ఈసారి కొంత తక్కువగా ఉన్న మాట వాస్తవం. వినోదయ సితం రీమేక్ కావడంతో పాటు తమన్ ఇచ్చిన రెండు పాటలకు పాజిటివ్ ఫీడ్ బ్యాక్ రాకపోవడం కొంత ప్రభావాన్ని చూపిస్తోంది. వీటి సంగతి ఎలా ఉన్నా రిలీజ్ రోజు సందడి మాములుగా ఉండదు. అందులోనూ భీమ్లా నాయక్ వచ్చి ఏడాది దాటిపోవడంతో ఓపెనింగ్స్ పరంగా ఎలాంటి టెన్షన్లు అక్కర్లేదు.
ఇక టికెట్ రేట్లకు సంబంధించి నిర్మాత టిజి విశ్వప్రసాద్ క్లారిటీ ఇచ్చేశారు. ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల్లోనూ తాము ఎలాంటి పెంపుని కోరడం లేదని, అనుకున్న బడ్జెట్ లోనే కంట్రోల్ గా తీశాం కాబట్టి బయ్యర్లకు నష్టం వచ్చే అవకాశం లేకుండా బిజినెస్ చేశామని చెప్పారు. అంతేకాదు బెనిఫిట్ షోలకు పర్మిషన్లు కూడా పెట్టలేదన్నారు. ఒకవేళ డిస్ట్రిబ్యూటర్లు కనక స్వంతంగా అప్పీల్ చేసుకుంటే ఛాన్స్ ఉండొచ్చు కానీ ఆయనగా ఆ మాట చెప్పలేదు. ఎక్స్ ట్రా షోలు లేవన్నారు కాబట్టి ఉదయం 7 కన్నా ముందు ప్రీమియర్లు పడే అవకాశం దాదాపు లేనట్టే.
తెలంగాణలో ఎలాగూ గరిష్ట ధర 295 అమలులో ఉంది కాబట్టి అక్కడ ఇబ్బంది లేదు కానీ ఆంధ్రాలో మాత్రం హ్యాపీగా 177 రూపాయలకే ఫస్ట్ డే పవన్ మూవీని ఎంజాయ్ చేయొచ్చు. దీన్ని బట్టి కలెక్షన్లు ఓపెనింగ్స్ పరంగా రికార్డులు బద్దలు కావడం లాంటివి ఎంత మేరకు జరుగుతాయో వేచి చూడాలి. పోటీగా ఇంకే సినిమాలు లేవు కాబట్టి మాములు రేట్లతోనే బెంచ్ మార్కులు సెట్ చేస్తానని పవన్ ఇంతకు ముందు వకీల్ సాబ్ లాంటి వాటితో నిరూపించారు. సో బ్రోకు కూడా పాజిటివ్ టాక్ వస్తే ఈసారి కూడా సెన్సేషన్స్ జరగొచ్చు. థియేటర్ కౌంట్ కూడా పెద్దగానే ఉండబోతోంది.
This post was last modified on July 19, 2023 1:21 pm
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…