Movie News

ఆ అమ్మాయి ఇంపాక్ట్ అలాంటిది

కొన్నిసార్లు తెర మీద కనిపించే నెగెటివ్ పాత్రలను ప్రేక్షకులు నిజంగానే ద్వేషిస్తుంటారు. వాళ్ల మీద కోపం పెంచుకుంటారు. కొన్ని పాత్రలు చేసిన నటీనటులను చూసి భయపడతారు కూడా. గతంలో ‘నరసింహా’ సినిమాలో రజినీకాంత్‌తో పోటాపోటీగా నటించి.. సినిమాలో ఆయన చేసిన హీరో పాత్రకు దీటుగా విలన్ క్యారెక్టర్‌ను పోషించిన రమ్యకృష్ణను సూపర్ స్టార్ ఫ్యాన్స్ విపరీంగా ద్వేషించారు. థియేటర్ల దగ్గర ఆమె ఫ్లెక్సీలను, దిష్టిబొమ్మలను సైతం తగులబెట్టారంటే ఆమె వేసిన ఇంపాక్ట్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.

ఇక తెలుగులోకి ‘రాఘవన్’ పేరుతో అనువాదమైన కమల్ హాసన్ సినిమా ‘వేట్టయాడు విలయాడు’లో సైకో విలన్ పాత్రలో బెంబేలెత్తించిన డేనియల్ బాలాజీని చూసి చెన్నైలోని ఒక మల్టీప్లెక్సులో అమ్మాయిలు భయంతో కేకలు పెడుతూ పరుగులు పెట్టారట. ఆ పాత్రలు వేసిన ఇంపాక్ట్ ఎలాంటిదో చెప్పడానికి ఇవి రుజువులు. ఇప్పుడు ‘బేబి’ సినిమాలో ఇద్దరబ్బాయిల జీవితాలతో ఆడుకున్న అమ్మాయిగా వైష్ణవి చైతన్య పాత్ర కూడా జనాల మీద ఇలాంటి ఇంపాక్టే వేస్తున్నట్లుగా కనిపిస్తోంది.

సోషల్ మీడియాలో ఈ సినిమాకు సంబంధించిన మీమ్స్‌లో వైష్ణవి క్యారెక్టర్‌ని ప్రొజెక్ట్ చేస్తున్న విధానం.. అలాగే సినిమా గురించి స్పందిస్తూ నెటిజన్లు పెడుతున్న పోస్టుల్లో వైష్ణవి మీద చూపిస్తున్న ద్వేషం చూస్తే ఆ పాత్ర మామూలు ఇంపాక్ట్ వేయలేదని అర్థమవుతోంది. ఆంధ్రా ప్రాంతంలో ‘బేబి’ షో అయ్యాక ఒక కుర్రాడు చెప్పు తీసుకుని పోస్టర్లో వైష్ణవిని కొడుతున్న దృశ్యం కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిన్న సక్సెస్ మీట్లో దర్శకుడు సాయిరాజేష్ అన్నట్లు.. వైష్ణవిని జనం ఇంతగా ద్వేషిస్తున్నారంటే ఆ పాత్ర అద్భుతంగా క్లిక్ అయిందని, వైష్ణవి పెర్ఫామెన్స్ అదిరిపోయిందని వేరే చెప్పాల్సిన అవసరం లేదేమో.

This post was last modified on July 18, 2023 10:49 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఏపీలో.. టైం టేబుల్ పాల‌న‌!!

సాధార‌ణంగా ప్ర‌తి ప్ర‌భుత్వం త‌న ప‌ని తాను చేసుకుని పోతుంది. ప్ర‌జ‌ల‌కు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్ర‌ణాళిక‌లు.. కొన్ని…

2 hours ago

స‌లార్-1పై నిరాశ‌.. స‌లార్-2పై భ‌రోసా

బాహుబ‌లి-2 త‌ర్వాత వ‌రుస‌గా మూడు డిజాస్ట‌ర్లు ఎదుర్కొన్న ప్ర‌భాస్‌కు స‌లార్ మూవీ గొప్ప ఉప‌శ‌మ‌నాన్నే అందించింది. వ‌ర‌ల్డ్ వైడ్ ఆ…

8 hours ago

సినీప్రముఖుల ఇళ్ళపై రాళ్ల‌దాడి.. సీఎం రేవంత్ రియాక్ష‌న్!

ఐకాన్ స్టార్‌.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొంద‌రు వ్య‌క్తులు దాడికి దిగిన విష‌యం తెలిసిందే. భారీ ఎత్తున…

10 hours ago

తాతకు త‌గ్గ‌ మ‌న‌వ‌డు.. నారా దేవాన్ష్ `రికార్డ్‌`

ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌న‌వ‌డు, మంత్రి నారా లోకేష్‌, బ్రాహ్మ‌ణి దంప‌తుల కుమారుడు నారా దేవాన్ష్‌.. రికార్డు సృష్టించారు. ఇటీవ‌ల…

11 hours ago

అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి.. ఎవరి పని?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌లో కొంద‌రు ఆందోళ‌న కారుల‌ను పోలీసులు అరెస్టు…

13 hours ago

అల్లు అర్జున్‌కు షాక్‌.. వీడియో బ‌య‌ట పెట్టిన సీపీ

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మ‌రింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేట‌ర్ ఘ‌ట‌న‌పై ఇప్ప‌టికే ఏ11గా కేసు న‌మోదు…

14 hours ago