చిన్న హీరో సినిమాని పెద్ద బడ్జెట్ లో నిర్మించినప్పుడు రిస్క్ ఉంటుంది. కంటెంట్ బలంగా ఉందనే నమ్మకం కలిగించడంతో పాటు వీలైనంత పోటీ లేకుండా చూసుకోవాలి. ఈ గురువారం విడుదల కాబోతున్న హిడింబ ముందు నుంచి ఒక డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లరనే అభిప్రాయాన్ని ప్రేక్షకుల్లో రేపింది. స్వాతంత్రం రాకముందు నాటి పరిస్థితులను వర్తమానానికి ముడిపెట్టి దర్శకుడు అనీల్ కన్నెగంటి ఏదో విభిన్న ప్రయోగమైతే చేశాడు. విజువల్స్ గట్రా చాలా ఇంటెన్సిటీతో ఆసక్తి రేపెలా ఉన్నాయి. అయితే బాక్సాఫీస్ వద్ద హిడింబకు అవకాశాలు అవరోధాలు రెండూ స్వాగతం పలుకుతున్నాయి.
ముందు పోటీ సంగతి చూస్తే ఏ సెంటర్స్ లో క్రిస్టోఫర్ నోలన్ హాలీవుడ్ మూవీ ఒప్పెన్ హెయిమర్ మొదటి అడ్డంకిగా నిలుస్తోంది. కాకపోతే ఇది అన్ని వర్గాలకు టార్గెట్ చేసింది కాదు కాబట్టి రెగ్యులర్ మాస్ దీన్ని అంతగా పట్టించుకోరు. రెండోది బేబీ స్ట్రాంగ్ రన్. యువత ఎగబడి చూస్తుండటంతో అగ్రిమెంట్లు పొడిగించుకునేందుకు ఎగ్జిబిటర్లు ఉత్సాహం చూపిస్తున్నారు. ఇది కొంత ప్రభావం చూపొచ్చు. సురేష్ సంస్థ అండతో వస్తున్న అన్నపూర్ణ ఫోటో స్టూడియో మీద పెద్దగా బజ్ లేదు. క్యాస్టింగ్ కన్నా క్వాలిటీని నమ్ముకుని టీమ్ సాహసం చేస్తోంది. విజయ్ ఆంటోనీ హత్యను తక్కువంచనా వేయడానికి లేదు.
ఇక అవకాశాల విషయానికి వస్తే హిడింబకున్న పెద్ద అడ్వాంటేజ్ జానర్. ఇలాంటి బ్యాక్ డ్రాప్ లో ఈ మధ్య సినిమాలు తగ్గాయి. కనెక్ట్ అయ్యేలా చూపిస్తే ఆడియన్స్ బ్లాక్ బస్టర్ ఇస్తారని విరూపాక్ష నిరూపించింది. ఈ ఛాన్స్ అశ్విన్ బాబు మూవీకి ఉంది. పైగా సాంప్రదాయ ఫ్రైడే రిలీజ్ కు బదులు ఒక రోజు ముందే రావడం ప్లస్ అవ్వొచ్చు. టాక్ బాగుంటే రెండో రోజు నుంచి టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు. నందితా శ్వేత, సిజ్జు తదితరులు కీలక పాత్రలు పోషించిన హిడింబకు రాజశేఖర్ ఛాయాగ్రహణం సమకూర్చగా వికాస్ సంగీతం అందించారు.యాంకర్ ఓంకార్ తమ్ముడు అశ్విన్ కి దీని సక్సెస్ చాలా కీలకం.
This post was last modified on July 18, 2023 12:14 am
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…