మంచి టాక్ తెచ్చుకున్న పెద్ద సినిమాలు సైతం తొలి వీకెండ్ తర్వాత బాక్సాఫీస్ దగ్గర స్లో అయిపోతుంటాయి. వసూళ్లలో డ్రాప్ సహజం. సోమవారం 60-70 శాతం ఆక్యుపెన్సీలు వచ్చినా కూడా సినిమా చాలా బాగా ఆడుతున్నట్లే. చిన్న సినిమాలకు థియేటర్లు సగం నిండినా గొప్పగా చూస్తారు. కానీ ‘బేబి’ అనే చిన్న సినిమా.. వీకెండ్ తర్వాతి రోజు చూపిస్తున్న దూకుడు టాలీవుడ్‌కు పెద్ద షాకే.
చిన్న సినిమాల్లో కూడా పెద్ద విజయం సాధించినవి ఉన్నాయి కానీ.. ఈ సినిమా రేపుతున్న సంచలనం మాత్రం అలాంటిలాంటిది కాదు. సోమవారం ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున హౌస్ ఫుల్స్ పడటం షాకింగే. మామూలుగా రాయలసీమలో మాస్ సినిమాలకు మాత్రమే సోమవారం వసూళ్లు నిలకడగా ఉంటాయి. కానీ ఈ చిన్న సినిమా ఆ మాస్ ఏరియాల్లో హౌస్ ఫుల్స్‌తో రన్ అవుతుండటం ట్రేడ్ పండిట్లకు కూడా పెద్ద షాకే.
తిరుపతి, కడప, కర్నూలు లాంటి సిటీల్లో ‘బేబి’కి మ్యాట్నీలు ఫుల్ అయ్యాయి. కడపలో ఈ సినిమా ఆడుతున్న రాజా థియేటర్లో హౌస్ ఫుల్ బోర్డు పెట్టేశారు మ్యాట్నీకి. తిరుపతిలో ఒకటికి మించి థియేటర్లు ఫుల్ అయ్యాయి. కర్నూలులోనూ అదే పరిస్థితి. ఇక ఆంధ్రా ప్రాంతంలో చూస్తే వైజాగ్ లాంటి పెద్ద సిటీలోనే కాక చిన్న నగరాల్లో కూడా ‘బేబి’కి సోమవారం ఫుల్స్ పడటం విశేషం.
వైజాగ్‌లో మధ్యాహ్నం మూడు షోలూ ఫుల్ అయ్యాయి. నైజాం ఏరియాలో కూడా ‘బేబి’ దూకుడు చూపిస్తోంది. సిటీలో పలు థియేటర్లలో మధ్యాహ్నం మంచి ఆక్యుపెన్సీలు వచ్చాయి. కొన్ని థియేటర్లు ఫుల్ అయ్యాయి. సాయంత్రం, రాత్రి షోలకు మరింత మంచి ఆక్యుపెన్సీ ఉంటుందనడంలో సందేహం లేదు. వీక్ డేస్‌లో ఇంత బలంగా నిలబడిన చిన్న సినిమాను ఈ మధ్య కాలంలో చూసి ఉండం. రోజు రోజుకూ రేంజి పెంచుకుంటూ వెళ్తున్న ‘బేబి’ ఫుల్ రన్లో ఏ స్థాయిలో నిలుస్తుందో అంచనా వేయడం కూడా కష్టంగా ఉంది.
This post was last modified on July 18, 2023 12:17 am
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో అరెస్టయి బెయిల్ పై విడుదలైన అల్లు అర్జున్ కు పోలీసులు తాజాగా మరో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా..ఆమె తనయుడు శ్రీతేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ…
తమిళ లెజెండరీ దర్శకుడు శంకర్ అంటే తెలుగు ప్రేక్షకులకే కాదు, ఇండస్ట్రీ జనాలకు కూడా ఆరాధన భావం. తన తొలి…
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…