మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ చరిత్రలోనే బిగ్గెస్ట్ హీరోల్లో ఒకడు. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ లాంటి దిగ్గజాలను ఢీకొట్టి ఏ బ్యాగ్రౌండ్ లేని హీరో నంబర్ వన్ కావడం.. పై ముగ్గురూ కూడా అందుకోలేని ఎత్తులను అందుకోవడం.. దశాబ్దాల తరబడి అగ్ర స్థానంలో కొనసాగడం అంటే మాటలు కాదు. 2009 ఎన్నికలకు ముందు సినిమాల్లో కొనసాగినంత వరకు ఆయనే టాలీవుడ్లో తిరుగులేని నంబర్ వన్.
అప్పటికే పెద్ద రేంజిలో ఉన్న మహేష్ బాబు సైతం 1 నుంచి 10 స్థానాలు చిరువే.. ఆయన స్థానాన్ని ఎవ్వరూ రీప్లేస్ చేయలేరు అని స్టేట్మెంట్ ఇచ్చాడంటే చిరు రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. మెగా ఫ్యామిలీలో పవన్ కళ్యాణ్ అయినా ఇంకొకరైనా చిరు పేరు వాడుకుని.. ఆయన వేసిన బాటలో నడుస్తూ స్టార్లు అయిన వాళ్లే. అందుకే మెగా అభిమానుల్లో ఒక వర్గానికి చిరు తర్వాతే ఎవరైనా అనే ఫీలింగ్ ఉంది.
ఈ నేపథ్యంలోనే చిరు తన కొత్త చిత్రం ‘భోళా శంకర్’లో పవన్ కళ్యాణ్‌ను ఇమిటేట్ చేయడం ఒక వర్గానికి నచ్చట్లేదు. పవన్.. చిరును కొన్ని సినిమాల్లో అనుకరిస్తే అది అందరికీ నచ్చింది కానీ.. చిరు రేంజికి పవన్‌ను ఇమిటేట్ చేయడం ఆ వర్గానికి ఏదోలా అనిపిస్తోంది. పవన్ తనకంటే పెద్ద రేంజ్ హీరో అని చిరు సంకేతాలు ఇస్తున్నట్లుగా ఉంది పవన్ మేనరిజంను ఇమిటేట్ చేయడం.
పైగా ‘భోళా శంకర్’ లాంటి రొటీన్ మాస్ సినిమాలో ఇలా చేయడం వాళ్లకు రుచించడం లేదు. అసలే ఈ సినిమా టీజర్, ఇతర ప్రోమోలు అభిమానులకు అంతగా రుచించడం లేదు. మెహర్ రమేష్ లాంటి దర్శకుడితో, ఒక రొటీన్ మాస్ మూవీని రీమేక్ చేయడం పట్ల అసంతృప్తితో ఉన్నారు. చాలామంది ‘క్రింజ్’ అనే పదం వాడుతున్నారు ఈ సినిమా ప్రోమోలు చూసి. ఇప్పుడు పవన్‌ను చిరు అనుకరించడం.. అది కూడా సరిగా కుదరకపోవడంతో ఎక్కువగా నెగెటివ్ కామెంట్లే వినిపిస్తున్నాయి.
This post was last modified on October 8, 2023 4:34 pm
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో అరెస్టయి బెయిల్ పై విడుదలైన అల్లు అర్జున్ కు పోలీసులు తాజాగా మరో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా..ఆమె తనయుడు శ్రీతేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ…
తమిళ లెజెండరీ దర్శకుడు శంకర్ అంటే తెలుగు ప్రేక్షకులకే కాదు, ఇండస్ట్రీ జనాలకు కూడా ఆరాధన భావం. తన తొలి…
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…