తమిళంలో చిన్న చిన్న సహాయ, విలన్ పాత్రలతో తన కెరీర్‌ను ఆరంభించాడు విజయ్ సేతుపతి. కానీ ఇప్పుడు దేశంలోనే మోస్ట్ వాంటెడ్ యాక్టర్స్‌లో అతనొకడు. భాషతో సంబంధం లేకుండా వేర్వేరు పరిశ్రమల్లో అతను కీలక పాత్రలు చేస్తున్నాడు. తెలుగులో ‘ఉప్పెన’లో విలన్ పాత్రతో మెస్మరైజ్ చేసిన అతను.. త్వరలోనే రామ్ చరణ్ మూవీలో నటించబోతున్నాడు.
హీరోగా కూడా సక్సెస్ అయినప్పటికీ.. తనకంటూ ఒక పరిధి గీసుకోకుండా విలన్, క్యారెక్టర్ రోల్స్ కూడా చేస్తూ భిన్నమైన దారిలో సాగుతున్నాడతను. కొన్ని నెలల కిందటే వచ్చిన హిందీ వెబ్ సిరీస్ ‘ఫర్జీ’లో సేతుపతి చేసిన పాత్ర అందరికీ బాగా కనెక్ట్ అయింది. బాలీవుడ్లో అతడికి మంచి గుర్తింపు తెచ్చింది. త్వరలోనే షారుఖ్ ఖాన్ సినిమా ‘జవాన్’లో అతను విలన్ పాత్రతో పలకరించబోతున్నాడు. అది బాలీవుడ్లో తన స్థానాన్ని మరింత బలోపేతం చేస్తుందని భావిస్తున్నారు.
కాగా హిందీలో విజయ్ సేతుపతి లీడ్ రోల్ చేసిన సినిమా కూడా రాబోతోంది. ఆ సినిమా కాంబినేషనే చాలా ఆసక్తి రేకెత్తిస్తోంది. ఆ చిత్రం పేరు.. మెర్రీ క్రిస్మస్. బాలీవుడ్లో జానీ గద్దర్, బద్లాపూర్, అంధాదున్ లాంటి వెరైటీ సినిమాలతో దర్శకుడిగా గొప్ప పేరు సంపాదించిన శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. ఇందులో కత్రినా కైఫ్ ముఖ్య పాత్ర పోషిస్తుండటం విశేషం. విజయ్ సేతుపతికి ఆమె జంటగా నటించబోతోందా అనే విషయంలో క్లారిటీ లేదు. సేతుపతి, కత్రినా, శ్రీరామ్ రాఘవన్.. ఈ కాంబినేషన్‌ను అసలెవరూ ఊహించలేరు.
హిందీ, తమిళ భాషల్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని క్రిస్మస్‌కు ముందు వీకెండ్లో డిసెంబరు 15న రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమా తెలుగులోనూ విడుదలయ్యే అవకాశముంది. శ్రీరామ్ రాఘవన్ ఎక్కువగా వైవిధ్యమైన థ్రిల్లర్ కథాంశాలతోనే సినిమాలు చేస్తుంటారు. ఆయన సినిమాలు ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తిస్తాయి. ఈసారి సేతుపతి లాంటి అద్భుత నటుడు దొరికిన నేపథ్యంలో తనను సరిగ్గా వాడుకుంటే సినిమా ఒక రేంజిలో ఉండొచ్చు.
This post was last modified on July 17, 2023 5:53 pm
వైసీపీలో చీలిక ఏర్పడుతోందా? ప్రజల మనోభావాలను విస్మరిస్తున్న వైసీపీ అధినేతపై ఆ పార్టీ నాయకులు గుస్సాగా ఉన్నారా? అంటే ఔననే…
ప్రపంచవ్యాప్తంగా విజయ్ అభిమానులను తీవ్ర మనస్థాపానికి గురి చేసిన జన నాయకుడు సెన్సార్ వివాదం ఒక కొలిక్కి వచ్చేసింది. యు/ఏ…
వెండితెరకు చాలా గ్యాప్ తీసుకున్న సమంత త్వరలో మా ఇంటి బంగారంతో కంబ్యాక్ అవుతోంది. జీవిత భాగస్వామి రాజ్ నిడిమోరు…
ప్రభాస్ అభిమానుల ఎదురు చూపులకు బ్రేక్ వేస్తూ రాజా సాబ్ థియేటర్లలో అడుగు పెట్టేశాడు. టాక్స్, రివ్యూస్ సంగతి కాసేపు…
ఏ రాష్ట్రంలో అయినా... ప్రతిపక్ష నాయకులకు ప్రభుత్వాలు పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వవు. సహజంగా రాజకీయ వైరాన్ని కొనసాగిస్తాయి. ఏపీ సహా…
ఏపీ రాజధాని అమరావతిపై వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపాయి. పార్టీలకు…