టెక్నాలజీ వాడకంలో ఇండియా మొత్తం మీద దాన్ని అద్భుతంగా ఉపయోగించుకునే దర్శకులు ఎవరంటే ఇద్దరి పేర్లే చెప్పాలి. ఒకరు రాజమౌళి రెండు శంకర్. కమల్ హాసన్ హీరోగా రూపొందుతున్న ఇండియన్ 2 షూటింగ్ కీలక దశకు చేరుకున్న సంగతి తెలిసిందే. 2024 సంక్రాంతి విడుదల సాధ్యం కాదని తేలిపోవడంతో వేసవికి ప్లాన్ చేస్తున్నారు. రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ రిలీజ్ కూడా దీని మీదే ఆధారపడి ఉంది. ఇదిలా ఉండగా ఇండియన్ 2 కోసం శంకర్ చనిపోయిన వాళ్ళను సాంకేతికత సహాయంతో తిరిగి తీసుకొచ్చేందుకు రంగం సిద్ధం చేశారట. అది కూడా చాలా సహజంగా అనిపించేలా.
వివరాల్లోకి వెళ్తే ఇండియన్ 2 మొదలుపెట్టేనాటికి కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్టు వివేక్ బ్రతికే ఉన్నారు. కొంత కీలక భాగం షూట్ చేశారు. తర్వాత ఆయన కాలం చేశారు. భారతీయుడు మొదటి భాగంలో పోలీస్ ఆఫీసర్ గా ముఖ్యమైన పాత్ర పోషించిన మలయాళం నటుడు నెడుముడి వేణు సైతం కన్ను మూశారు. ఈయనతో కొన్ని సీన్లు తీశారు. ఇప్పుడు బ్యాలన్స్ మిగిలింది. రీ ప్లేస్ చేసి రీ షూట్ అంటే జరగని పని. అందుకే సహజత్వం కోసం బాడీ డబుల్స్ ని వాడి కొత్త తరహా హాలీవుడ్ టెక్నాలజీతో నిజంగా వాళ్ళు మళ్ళీ వచ్చారా అనిపించేలా తీయబోతున్నట్టు చెన్నై టాక్.
నిజంగానే ఇదో అరుదైన ఘట్టమనే చెప్పాలి. గతంలో కలిసుందాం రా, యమదొంగ సినిమాల్లో స్వర్గీయ ఎన్టీఆర్ ని గ్రాఫిక్స్ రూపంలో మళ్ళీ తీసుకొచ్చి పాటల్లో చూపించారు . కానీ ఇండియన్ 2లో అలా కాదు. లేని ఆర్టిస్టుతో కొత్త సన్నివేశాలు తీయాలి. ఇది ఒక రకంగా కత్తి మీద సామే. ఏ మాత్రం తేడా వచ్చినా అంతే సంగతులు. అన్నట్టు కమల్ హాసన్ ఫ్లాష్ బ్యాక్ లో యువకుడిగా కనిపించే ఎపిసోడ్ కి సైతం సిజిని వాడబోతున్నారు . చూస్తుంటే చాలా గ్యాప్ తర్వాత శంకర్ సోషల్ మెసేజ్ తో పాటు అబ్బురపరిచే ఎఫెక్ట్స్ తో ఏదో మేజిక్ చేస్తాడని అభిమానులు ఎదురు చూస్తున్నారు.
This post was last modified on July 17, 2023 8:10 pm
సూళ్ళురుపేట లో ఈ నెల 18 నుండి 20 వరకు జరుగుతున్న ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 వేడుకలు శనివారం ఉదయం…
ఏపీలోని కూటమి సర్కారులో కీలక పాత్ర పోషిస్తున్న టీడీపీలో సీనియర్ నాయకుల వ్యవహారం కొన్నాళ్లుగా చర్చకు వస్తోంది. సీనియర్లు సహకరించడం…
కీలక నిర్ణయాన్ని తీసుకుంది రేవంత్ సర్కారు. హైదరాబాద్ మహానగరి విస్త్రతిని పెంచేస్తూ అంచనాల్ని సిద్ధం చేసింది. ఇప్పటివరకు హెచ్ఎండీఏ (హైదరాబాద్…
ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా వద్ద ఏపీ సీఎం చంద్రబాబు…
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందన్నది చెప్పలేం. రాజకీయాలు రాజకీయాలే. ఇప్పుడు ఇలాంటి పరిణామమే ఎన్టీఆర్ జిల్లాలోనూ జరుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే…
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా శనివారం రాత్రి ఏపీ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు ఏపీ…