ఎన్నో ఆశలు పెట్టుకున్న కస్టడీ తీవ్రంగా నిరాశ పరచడంతో నాగ చైతన్య గీత ఆర్ట్స్ 2 బ్యానర్ లో చేయబోయే సినిమా కోసం రెడీ అవుతున్నాడు. మత్స్యకారుల బ్యాక్ డ్రాప్ లో చందూ మొండేటి దర్శకత్వం వహించబోయే ఈ ఎమోషనల్ డ్రామాలో చైతు క్యారెక్టర్ ని చాలా డిఫరెంట్ గా డిజైన్ చేయిస్తున్నారు. తండేల్ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. బడ్జెట్ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని అల్లు అరవింద్ నిర్ణయించుకున్నారట. ఇదే బ్యాక్ డ్రాప్ లో వచ్చిన రంగస్థలం, ఉప్పెనలను మించి ఇది ట్రెండ్ సెట్టర్ అవుతుందనే నమ్మకం టీమ్ సభ్యుల్లో బలంగా కనిపిస్తోంది.
దీని తర్వాత చైతుకి ఏ కాంబినేషన్ ఉండొచ్చనే ఊహాగానాలు పెరుగుతున్నాయి. అందులో మొదటి పేరు రామ్ అబ్బరాజు. ఇటీవలే శ్రీవిష్ణు సామజవరగమనతో అదిరిపోయే బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ దర్శకుడికి అమాంతం డిమాండ్ పెరిగిపోయింది. ఇటీవలే తను చైతన్యని కలిసి ఒక లైన్ చెప్పాడట. విడాకుల చుట్టూ తిరిగే వెరైటీ పాయింట్ తో ఆద్యంతం నవ్వించేలా ఉంటుందని ఇన్ సైడ్ టాక్. అయితే సమంతతో తన వైవాహిక జీవితం డైవర్స్ తో ముగిసిన నేపథ్యంలో తాను చేయబోయే సినిమాల మీద సోషల్ మీడియాలో ఎలాంటి కామెంట్స్ రాకూడదనేది చైతు ఆలోచన.
ఈ రిస్క్ గురించి ఆలోచించే కొన్ని కీలక మార్పులు సూచించినట్టు తెలిసింది. ఒకవేళ అవి కనక రామ్ వర్కౌట్ అయ్యేలా రాసుకొస్తే మాత్రం ప్రాజెక్టు పట్టాలు ఎక్కొచ్చు. ఎలాగూ చైతు- చందూ మొండేటిల ప్యాన్ ఇండియా మూవీకి ఎంత లేదన్నా షూటింగ్ పూర్తవ్వడానికి ఆరేడు నెలలు సులభంగా పడుతుంది. ఆలోగా రామ్ స్క్రిప్ట్ ని పర్ఫెక్ట్ గా రాసుకోవచ్చు. దర్శకులను ఎంత ఎక్కువగా నమ్మితే అంతగా షాకులు తింటున్న చైతుకి థాంక్ యు, లాల్ సింగ్ చద్దాలు గట్టి పాఠాలే నేర్పించాయి. అందుకే ఈసారి తొందపడకుండా నిదానమే ప్రధానం సూత్రం పాటిస్తున్నాడు.
This post was last modified on July 17, 2023 10:35 am
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో అరెస్టయి బెయిల్ పై విడుదలైన అల్లు అర్జున్ కు పోలీసులు తాజాగా మరో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా..ఆమె తనయుడు శ్రీతేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ…
తమిళ లెజెండరీ దర్శకుడు శంకర్ అంటే తెలుగు ప్రేక్షకులకే కాదు, ఇండస్ట్రీ జనాలకు కూడా ఆరాధన భావం. తన తొలి…
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…