ఈ ఏడాది టాలీవుడ్ వేసవి ఎంత డల్లుగా సాగిందో తెలిసిందే. దసరా, విరూపాక్ష లాంటి రెండు మూడు సినిమాలు మాత్రమే మంచి వసూళ్లు రాబట్టాయి. చాలా సినిమాలు బాక్సాఫీస్ దగ్గర చతికిలపడ్డాయి. ఐతే సమ్మర్ సీజన్ ముగిశాక ‘ఆదిపురుష్’తో మళ్లీ బాక్సాఫీస్ దగ్గర కొంచెం సందడి నెలకొంది. కానీ ఆ సందడి ఒక్క వీకెండ్‌కే పరిమితం అయింది.
తర్వాతి రెండు వారాల్లో వచ్చిన సినిమాలన్నీ తుస్సుమనిపించి.. థియేటర్ల మెయింటైనెన్స్‌కు సరిపడా డబ్బులు కూడా రాలేదు. ఐతే జూన్ నెలాఖర్లో టాలీవుడ్ బాక్సాఫీస్‌కు మంచి ఉత్సాహాన్నిస్తూ.. ‘సామజవరగమన’ అనే చిన్న సినిమా అదిరిపోయే వసూళ్లు రాబట్టింది. ఆ సినిమా స్థాయికి మించి కలెక్షన్లు తెచ్చుకుంది. ఈ చిన్న చిత్రం గ్రాస్ కలెక్షన్లు రూ.45 కోట్లను దాటిపోవడం విశేషం. మూడో వారంలో కూడా ఈ సినిమాకు ఓ మోస్తరుగా వసూళ్లు వస్తున్నాయి.
‘సామజవరగమన’ రెండు వారాల పాటు బాక్సాఫీస్‌ను పోషించగా.. ఈ వారం ‘బేబి’ దాన్నుంచి బ్యాటన్ అందుకుంది. ఈ చిత్రం సంచలన ఓపెనింగ్స్‌తో దూసుకెళ్తోంది. రెండు రోజుల్లోనే రూ.14 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసినట్లు ట్రేడ్ పండిట్లు చెబుతున్నారు. ఆదివారం కూడా మంచి ఊపు కనిపిస్తోంది. దీంతో పాటు రిలీజైన ‘మహావీరుడు’ కూడా పర్వాలేదనిపిస్తోంది. ఓ మోస్తరుగా వసూళ్లు వస్తున్నాయి.
ఇక వచ్చే వారం రిలీజ్ కానున్న సినిమాల్లో ‘హిడింబ’కు మంచి హైప్ కనిపిస్తోంది. ఆ చిత్రానికి కూడా మంచి ఓపెనింగ్స్ వచ్చేలా కనిపిస్తోంది. టాక్ బాగుంటే అది వీకెండ్ విన్నర్ కావచ్చు. ఇక జులై చివరి వారంలో ‘బ్రో’ లాంటి పెద్ద సినిమా రానుంది. పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఓపెనింగ్స్ ఎలా ఉంటాయో చెప్పేదేముంది? ఆగస్టులో ఇండిపెండెన్స్ డే వీకెండ్లో జైలర్, భోళా శంకర్ లాంటి పెద్ద సినిమాలు విడులవుతున్నాయి. కాబట్టి ఇంకో నెల రోజుల పాటు బాక్సాఫీస్ కళకళలాడటం ఖాయం.
This post was last modified on July 17, 2023 12:51 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…