బాలీవుడ్ ఎవర్ గ్రీన్ పెయిర్స్‌లో షారుఖ్ ఖాన్-కాజోల్‌లది ఒకటి. ‘దిల్‌వాలే దుల్హానియా లే జాయేంగే’ సినిమాతో భారతీయ ప్రేక్షకులను ఈ జంట ఎలా ఉర్రూతలూగించిందో తెలిసిందే. ఆ తర్వాత ‘మై నేమ్ ఈజ్ ఖాన్’తోనూ ఈ జంట ఆకట్టుకుంది. షారుఖ్, కాజోల్ వ్యక్తిగతంగా కూడా చాలా మంచి మిత్రులు. దశాబ్దాలుగా వీరి మధ్య స్నేహం కొనసాగుతోంది.
ఐతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో కాజోల్.. షారుఖ్ లాస్ట్ మూవీ ‘పఠాన్’ గురించి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఆ కామెంట్లు షారుఖ్ అభిమానులకు ఆగ్రహం తెప్పిస్తున్నాయి. తన కొత్త చిత్రం ‘ది ట్రయల్’ హాట్ స్టార్ ద్వారా రిలీజైన నేపథ్యంలో ఆమె ఒక ఇంటర్వ్యూలో షారుఖ్ గురించి మాట్లాడింది. మళ్లీ షారుఖ్‌తో ఒక సినిమా చేయాలని ఉందని.. అందులో తమ ఇద్దరి మధ్య రొమాంటిక్ సాంగ్ ఉంటే బాగుంటుందని కాజోల్ వ్యాఖ్యానించింది.
కాగా.. షారుఖ్ ఇప్పుడు కలిస్తే ఆయన్ని ఏం ప్రశ్న అడుగుతారు అని ఇంటర్వ్యూయర్ అడిగితే.. “పఠాన్ సినిమా ఒరిజినల్ కలెక్షన్లు ఎంతో చెప్పమంటా” అని కాజల్ పేర్కొంది. కాజల్ క్యాజువల్‌గా, షారుఖ్‌తో తనకున్న చనువు దృష్ట్యా ఈ మాట అన్నట్లు కనిపించినా.. అభిమానులు మాత్రం వేరే రకంగా తీసుకున్నారు.
షారుఖ్ ఖాన్‌కు చాలా ఏళ్ల తర్వాత బ్లాక్ బస్టర్ విజయాన్ని అందించిన ‘పఠాన్’ రూ.వెయ్యి కోట్లకు పైగానే వసూళ్లు రాబట్టినట్లు చిత్ర ప్రతినిధులు, ట్రేడ్ పండిట్లు పేర్కొన్నారు. కానీ కాజోల్ మాటలు చూస్తే అవి రియల్ కలెక్షన్లు కావని.. ఎక్కువ చేసి చూపించారని అన్నట్లుగా కనిపిస్తోంది. అందుకే షారుఖ్ ఫ్యాన్స్ ఆమె మీద మండిపడుతున్నారు. కాజోల్ ఇలా వివాదంలో చిక్కుకోవడం కొన్ని వారాల వ్యవధిలో ఇది రెండోసారి. మనం నిరక్ష్యరాస్యులైన రాజకీయ నేతల పాలనలో బతుకుతున్నామంటూ ఆమె ఇటీవల చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయిన సంగతి తెలిసిందే.
This post was last modified on July 17, 2023 8:43 am
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…