మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందుతున్న భోళా శంకర్ కు సంబంధించిన ఒక కీలకమైన లీక్ ని స్వయంగా ఆయనే ట్విట్టర్ లో షేర్ చేసుకున్నారు. ఇందులో తమ్ముడు పవన్ కళ్యాణ్ అభిమానిగా కనిపించబోతున్నట్టు, తనకు సంబందించిన డైలాగులు, పాటలను అనుకరిస్తూ స్వీట్ సర్ప్రైజ్ ఇస్తున్నట్టు చెప్పేశారు. ఇది సూత్రప్రాయంగా కొన్ని నెలల క్రితమే బయటికి వచ్చినప్పటికీ నిజమో కాదోననే అయోమయంలో ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పుడు స్వయంగా అన్నయ్యే కుండ బద్దలు కొట్టేయడంతో ఇంకెలాంటి అనుమానాలు అక్కర్లేదు.
ఈ విషయాన్ని ప్రకటించేందుకు చిరంజీవి ఒక వీడియో కూడా తయారు చేయించారు. పవన్ తన రెఫరెన్సులు వాడుకున్న సర్దార్ గబ్బర్ సింగ్, పంజా, బంగారం తదితర చిత్రాల్లో క్లిప్పులను జోడించి ఈసారి తాను ఆ ట్రెండ్ ని ఫాలో కాబోతున్నట్టు ప్రకటించారు. ఇది ఒక రకంగా మంచి ఎత్తుగడే. టీజర్ తో పాటు రెండు పాటలు వచ్చినా భోళా శంకర్ మీద ఆశించిన హైప్ పెరగలేదు. చిరు ఎంత హుషారుగా కనిపించినా రీమేకనే నెగటివిటీతో పాటు మెహర్ రమేష్ పేరు అభిమానులకు డౌట్లు రేపింది. అందుకే ఇలాంటి ప్రమోషన్ ట్రిక్కులు వాడితేనే జనాల దృష్టిని తిప్పుకోవచ్చు.
ఆగస్ట్ 11 రిలీజ్ కానున్న భోళా శంకర్ లో తమన్నా హీరోయిన్ గా నటించగా కీర్తి సురేష్, సుశాంత్ లు జోడిగా కనిపించనున్నారు. మహతి స్వర సాగర్ సంగీతం సినిమా విడుదలయ్యాక కనెక్ట్ అవుతుందేమో చూడాలి. హైదరాబాద్ నుంచి కోల్కతా వెళ్లి టాక్సీ డ్రైవర్ గా మారిన శంకర్ అక్కడ విలన్ కోసం చేసే వేట ప్రధానంగా కథ సాగుతుంది. ఒరిజినల్ వెర్షన్ లో అజిత్ బాడీ లాంగ్వేజ్, నటనకు చాలా పేరొచ్చింది. అంతే స్థాయిలో మెహర్ రమేష్ తీశాడా లేదానేది ఆసక్తికరంగా మారింది. సౌత్ లో రజినీకాంత్ జైలర్ తో భోళా శంకర్ కు పోటీ ఎదురు కానుంది. గెలుపు ఎవరిది కానుందో.
This post was last modified on July 17, 2023 6:29 am
ఎవరెవరి దగ్గరికో వెళ్లి ఎన్నో నెరేషన్లు జరుపుకున్న ఎల్లమ్మ చివరికి దేవిశ్రీ ప్రసాద్ తెరంగేట్రానికి ఉపయోగపడటం ఎవరూ ఎక్స్ పెక్ట్…
కారుణ్య మరణం…వైద్యం చేసినా బ్రతికే అవకాశం లేక చావు కోసం ఎదురు చూసే పేషెంట్ల కోసం వారి కుటుంబ సభ్యులు…
సాధారణంగా జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ అభిమానుల మధ్య స్నేహ భావమే ఉంటుంది. ఆ ఇద్దరు హీరోలు ఒకరినొకరు బావా…
మెగాస్టార్ చిరంజీవి సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే.. బాక్సాఫీస్ దగ్గర ఇప్పటికీ ఎలాంటి విధ్వంసం సృష్టించగలరో ‘మన శంకర వరప్రసాద్…
సంక్రాంతి వస్తే చాలు పతంగులు ఎగురవేసేందుకు చిన్నా, పెద్దా అంతా ఆసక్తి చూపుతుంటారు. అయితే, దారంతో కాకుండా చైనా మాంజాతో…
పండగ చివర్లో వచ్చిన సినిమా నారి నారి నడుమ మురారి. ప్రీమియర్లు పడే దాకా అండర్ డాగ్ గా ఉంటూ…