ఇండియన్ సినిమాలో తర్వాతి బిగ్ రిలీజ్ అంటే.. ‘సలార్’యే. గత నెలలో ‘ఆదిపురుష్’ మూవీతో దేశవ్యాప్తంగా బాక్సాఫీస్ దగ్గర ఒక వీకెండ్ పాటు సందడి తీసుకొచ్చిన ప్రభాస్.. ‘సలార్’తో ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేయడం ఖాయం అనుకుంటున్నారు. వివిధ భాషల్లో ఈ చిత్రానికి బంపర్ క్రేజ్ ఉంది. ‘సలార్’ నుంచి చిన్న టీజర్ రిలీజ్ చేస్తే ఒక రెండ్రోజుల పాటు సోషల్ మీడియా వేడెక్కిపోయింది.
‘కేజీఎఫ్’ దర్శకుడు ప్రశాంత్ నీల్ తీస్తున్న సినిమా కావడం, ప్రభాస్ ఇమేజ్‌కు తగ్గ పక్కా మాస్ బొమ్మ కావడంతో ‘సలార్’ మిస్ ఫైర్ అయ్యే అవకాశాలే ఉండవని అభిమానులు అంచనా వేస్తున్నారు. ఈ సిినిమాకు ఉన్న క్రేజ్ దృష్ట్యా బిజినెస్ కూడా ఒక రేంజిలో జరుగుతుందని అంచనా వేస్తున్నారు. హైప్‌ను నిర్మాతలు క్యాష్ చేసుకునే క్రమంలో అసాధారణ రేట్లు చెబుతున్నట్లు తెలుస్తోంది. ఏపీ-తెలంగాణకు కలిపి రూ.200 కోట్ల దాకా టార్గెట్ పెట్టుకున్నారట నిర్మాతలు.
ఐతే ప్రభాస్ గత మూడు చిత్రాల తాలూకు చేదు అనుభవాల దృష్ట్యా ‘సలార్’ను అంతేసి రేట్లు పెట్టి కొనడంపై డిస్ట్రిబ్యూటర్లు తటపటాయిస్తున్నారు. ఏమాత్రం తేడా వచ్చినా నిండా మునగడం ఖాయమని అనుకుంటున్నారు. ఐతే తాము కోరుకున్న రేట్లు రాకపోతే కమిషన్ బేసిస్ మీద సొంతంగా రిలీజ్ చేసుకోవడానికి ‘సలార్’ నిర్మాతలు వెనుకాడట్లేదట. ప్రభాస్ గత సినిమాలతో దీనికి పోలిక లేదని.. ఇది మినిమం గ్యారెంటీ సినిమా అని.. ‘కేజీఎఫ్’ను మించి అద్భుతాలు చేస్తుందని.. ఓపెనింగ్స్ ఎవ్వరూ ఊహించని స్థాయిలో ఉంటాయని వాళ్లు భావిస్తున్నారట.
సొంతంగా రిలీజ్ చేసుకుంటే తాము అనుకున్న టార్గెట్‌ను మించి ఆదాయం రాబట్టవచ్చని అంచనా వేస్తున్నారట. తెలంగాణ వరకు సినిమాను అనుకున్న రేటుకి అమ్మడం కష్టం కాకపోవచ్చని.. ఏపీలో ఇబ్బంది తలెత్తితే మాత్రం సొంతంగా రిలీజ్ చేద్దామని ఫిక్సయ్యారట. అవసరమైతే తెలంగాణలోనూ ఓన్ రిలీజ్ చేయడానికి కూడా సిద్ధంగానే ఉన్నారట. మరి ఇది కాన్ఫిడెన్సో.. ఓవర్ కాన్ఫిడెన్సో చూడాలి.
This post was last modified on July 15, 2023 7:58 pm
నిన్న ఇరుముడి ఓటిటిలో వచ్చేసింది. థియేటర్ రన్ ఇంకా కొనసాగుతున్నప్పటికీ ముందస్తు అగ్రిమెంట్ వల్ల కేవలం 28 రోజుల విండోతో…
తెలంగాణాలోని రైల్వే స్టేషన్ వద్ద చెత్త ఏరుకునే ఒక మహిళ మీద హోం గార్డు చేసిన దౌర్జన్యం తీవ్ర దుమారం…
ఎన్ని నామినేషన్లు వెళ్లినా, మన వైపు నుంచి పెద్ది ఇరుముడి లాంటి బ్లాక్ బస్టర్లను పంపినా, ఆస్కార్ బరిలో మరాఠి…
నిన్న చెన్నైలో జరిగిన ఒక సినిమా ఈవెంట్ కు అతిథిగా వచ్చిన దర్శకుడు సిబి చక్రవర్తి అట్లీని పొగిడే క్రమంలో…
పార్టీ ఏదైనా.. నాయకుడు ఎవరైనా సొంత సామాజిక వర్గం అండ అయితే ఉండాలి. పోనీ.. అది లేకపోతే.. ప్రజాబలం అయినా…
ఎనిమిదేళ్ల క్రితం 2019లో తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన సంఘటన దిశాపై జరిగిన అఘాయిత్యం. ఒక వైద్య విదార్థినిని నలుగురు కరుడు…