రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ తమ్ముడిగా ఆనంద్ ఇండస్ట్రీకి వచ్చి అయిదేళ్ళు దాటినా ఇప్పటిదాకా పెర్ఫార్మన్స్ పరంగా గొప్పగా చెప్పుకునే మూవీ ఏదీ చేయలేదు. 2019 దొరసానితో మొదలుపెట్టి ఓటిటిలో డైరెక్ట్ రిలీజైన హైవే దాకా తన నటన చాలా బాగుందనే కాంప్లిమెంట్స్ అందుకోలేదు. మిడిల్ క్లాస్ మెలోడీస్ లో ఓకే పర్వాలేదనిపించాడు అంతే. అన్నయ్య బ్రాండ్ వల్లే ఆఫర్లు వస్తున్నాయనే కామెంట్ కూడా వినిపించింది. అల్లు శిరీష్ లాగా కెరీర్ లో బాగా స్ట్రగుల్ అవ్వక తప్పదనే అభిప్రాయం చాలా మందిలో ఉంది. ఇప్పుడా మరక దాదాపుగా తుడిచినట్టే.
బేబీలో ఆనంద్ దేవరకొండ తన పాత్రను క్యారీ చేసిన విధానం యూత్ కి బాగా దగ్గరయ్యింది. పదో తరగతి ఫెయిలై ఆటో డ్రైవర్ గా మారినా ప్రేమలో నిజాయితిగా ఉండే కుర్రాడి క్యారెక్టర్ లో చాలా బాగా నటించాడు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో అది నా పిల్లరా అంటూ చెప్పే డైలాగు, వైష్ణవి చైతన్యతో బ్రిడ్జి మీద చెప్పే సంభాషణలు అతని పరిణితికి నిదర్శనం. నిజానికి ఇద్దరు హీరోల్లో అందంగా స్టయిలిష్ గా ఉన్నది విరాజ్ అశ్విన్. కానీ యువతకు మాత్రం ఆనంద్ దగ్గరయ్యాడు. బేబీ రిలీజ్ కావడం కోసం గత ఆరేడు నెలలుగా ఆనంద్ ఎవరికీ కొత్త కమిట్ మెంట్స్ ఇవ్వలేదు.
ఇప్పుడీ జోష్ తో అవకాశాలు బాగానే వస్తాయి. బేబీ ఫలితం ఏ స్థాయిలో ఉండబోతోందన్నది పక్కన పెడితే ఆర్టిస్టుగా ఆనంద్ కి పెద్ద ప్రమోషన్ తీసుకొచ్చింది. అది కూడా బరువైన భావోద్వేగాలు డిమాండ్ చేసే క్యారెక్టర్ ని ఈజ్ తో పండించడం వల్ల జనాల దృష్టిలో పడేందుకు ఇదొక మంచి మలుపుగా నిలవబోతోంది. అన్న విజయ్ దేవరకొండ సంతోషం ఈ విషయంలో మాములుగా లేదు. రిలీజ్ రోజు రాత్రే హీరో హీరోయిన్ ని పిలిచేసి పార్టీ ఇచ్చాడు. తమ్ముడిని ఇంత పెద్ద బ్రేక్ దొరికినప్పుడు అంతకన్నా ఆనందం ఏముంటుంది. ఖుషితో తనూ హిట్టు కొడితే లెక్క సరిపోతుంది
This post was last modified on July 15, 2023 12:17 pm
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…
దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…