పూరి జగన్నాథ్ తర్వాత లోకేషే

కొత్త తరం ఫిలిం మేకర్స్ ఎంత క్రియేటివ్ గా ఉన్నా సరే వీలైనంత వేగంగా సినిమాలు తీయడం అవసరం. అప్పుడే నిర్మాత పెట్టుబడికి, థియేటర్ల ఫీడింగ్ కి తగినంత భద్రత ఉంటుంది. ఒకప్పుడు దాసరి, రాఘవేంద్రరావు లాంటి దిగ్గజాలు ఒకేరోజు రెండు మూడు షూటింగులు పెట్టుకున్న ఉదంతాల నుంచి ఏడాదికి ఒకటి పూర్తి చేస్తేనే గొప్పనే స్టేజికి దిగిపోయాం. కారణాలు ఏమైనా స్టార్ డైరెక్టర్లలో ఈ వేగం లోపించడం వల్లే హీరోలు కూడా ఇబ్బంది పడుతూ సంవత్సరానికి ఒకటి రిలీజ్ చేయించడానికే నానా తంటాలు పడుతున్నారు. కానీ లోకేష్ కనగరాజ్ మాత్రం స్పెషల్ గా నిలుస్తున్నాడు.

ఈ క్రియేటివ్ డైరెక్టర్ ఇప్పటిదాకా తీసింది అయిదు సినిమాలు. మొదటిది తప్ప మిగిలినవి అన్నీ పెద్ద మార్కెట్ ఉన్న స్టార్లేవే. అయినా సరే దేనికీ నూటా యాభై పని దినాలు తీసుకోకపోవడం అతని స్పీడ్ కి నిదర్శనం. మానగరం 45 రోజులు, ఖైదీ 62 రాత్రిళ్ళు, మాస్టర్ 129 రోజులు , విక్రమ్ 110 రోజులు, తాజాగా లియోకి 125 రోజులకు గుమ్మడికాయ కొట్టించాడు. కార్తీ, విజయ్, కమల్ హాసన్ లాంటి మోస్ట్ వాంటెడ్ స్టార్లతోనే లోకేష్ ఈ ఫీట్ సాధించాడు. బడ్జెట్ ఎంత పెరిగినా సరే వర్కింగ్ డేస్ ని మాత్రం తన అదుపులో ఉంచుకుంటున్న లోకేష్ కనగరాజ్ నుంచి నిజంగానే స్ఫూర్తి తీసుకోవాల్సిందే.

ఒకప్పుడు ఈ స్టైల్ పూరి జగన్నాధ్ దగ్గర ఉండేది. మహేష్ బాబుతో బిజినెస్ మెన్ ని మూడు నెలల్లో తీయడం రికార్డుగా చెప్పుకుంటారు. పోకిరి, ఇడియట్ లకు కూడా ఎక్కువ సమయం తీసుకోకుండా బ్లాక్ బస్టర్స్ ఇచ్చాడు. లియో తర్వాత ఈ స్పీడ్ లో ఎలాంటి మార్పు ఉండదని లోకేష్ అంటున్నాడట. అతని లిస్టులో ప్రస్తుతం విక్రమ్ 2, ఖైదీ 2, రోలెక్స్ ఉన్నాయి. ఇవి కాకుండా రామ్ చరణ్, ప్రభాస్ లతో చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇదే దూకుడు కొనసాగిస్తే ఇవన్నీ ఇంకో అయిదేళ్లలో సులభంగా పూర్తి చేసుకోవచ్చు. చేతిలో కథలు రెడీగా ఉంటే ఇలాంటి కాన్ఫిడెన్సే వస్తుంది