గత ఏడాది కాలంలో ఎన్నో పాత సినిమాలు రీ రిలీజ్ అయ్యాయి. వాటిలో చాలా వరకు స్టార్ హీరోలు నటించిన బ్లాక్ బస్టర్ మూవీసే ఉన్నాయి. ఆ హీరోల అభిమానులు వాటిని ఓన్ చేసుకుని చాలా హంగామా చేస్తూ వచ్చారు. ఐతే ఇలాంటి పెద్ద సినిమాల మధ్య కొన్ని చిన్న సినిమాలు.. స్టార్ హీరోల ఫ్యాన్స్ హడావుడి లేకుండానే రీ రిలీజ్‌లో సత్తా చాటాయి. అందులో తమిళ అనువాద చిత్రం 3.. తరుణ్ భాస్కర్ మూవీ ఈ నగరానికి ఏమైంది లాంటివి ఉన్నాయి.
ముఖ్యంగా ఈ మధ్యే రీ రిలీజ్ అయిన ఈ నగరానికి ఏమైంది యూత్ దృష్టిని బాగా ఆకర్షించింది. సినిమాకు ఎవరూ ఊహించని స్థాయిలో హౌస్ ఫుల్స్ పడ్డాయి. మంచి వసూళ్లు కూడా వచ్చాయి. త్వరలో ఇలాగే ఇంకో కల్ట్ కామెడీ మూవీ ప్రేక్షకులను అలరించబోతోంది. అదే.. వెంకీ. మాస్ రాజా రవితేజ హీరోగా ఒకప్పటి స్టార్ డైరెక్టర్ శ్రీను వైట్ల తన కెరీర్ ఆరంభంలో తీసిన సినిమా వెంకీ. ఈ సినిమా వచ్చి 20 ఏళ్లు కావస్తోంది కానీ.. ఇప్పటికీ అది ఎవర్ గ్రీన్ కామెడీ అనడంలో సందేహం లేదు. ఈ సినిమాలోని అనేక సీన్లు, డైలాగులు ఇప్పటికీ మీమ్స్ రూపంలో ప్రేక్షకులను అలరిస్తున్నాయి.
ఈ చిత్రంలో రవితేజ చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. ఆయనతో కలిసి బ్రహ్మానందం, ఏవీఎస్ తదితరులు కడుపు చెక్కలయ్యేలా నవ్వించారు ప్రేక్షకులను. ఇందులో పాటలు కూడా అదిరిపోతాయి. ఈ చిత్రాన్ని నూతన సంవత్సర కానుకగా 2023 డిసెంబరు 30 నుంచి మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో రీ రిలీజ్ చేయబోతున్నారు. రవితేజ ఫ్యాన్స్ అనే కాదు.. తెలుగు సినిమా కామెడీ ప్రియులందరూ ఈ సినిమా చూసి నోస్టాల్జిక్ ఫీలింగ్ పొందే అవకాశముంది. ఈ సినిమాలో కేవలం ఒక్క ట్రైనన్ ఎపిసోడ్ చాలు.. ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి.
This post was last modified on October 8, 2023 4:35 pm
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…
పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…
మలయాళ లెజెండరీ ఆర్టిస్ట్ మోహన్ లాల్ ఎంత గొప్ప నటుడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నాలుగు దశాబ్దాల కెరీర్లో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…
క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…