తెలుగులోనే కాక తమిళంలోనూ ఒక దశాబ్దం పాటు టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది మిల్కీ బ్యూటీ తమన్నా. కానీ ఎలాంటి హీరోయిన్‌కైనా ఒక దశ దాటాక అవకాశాలు తగ్గిపోవడం.. కెరీర్ నెమ్మదించడం మామూలే. తమన్నా కూడా అందుకు మినహాయింపు కాలేకపోయింది. ఆమె సందీప్ కిషన్ లాంటి చిన్న హీరోతో కూడా జట్టు కట్టడం అంటే తన రేంజ్ పడిపోయిందనేందుకు సంకేతం.
పెద్ద సినిమాల్లో ఛాన్సులు తగ్గాక.. కెరీర్ ఊపు తగ్గాక ఆమె తనకు తాను పెట్టుకున్న కొన్ని రూల్స్‌ను బ్రేక్ చేసింది. లిప్ లాక్స్.. ఇంటిమేట్ సీన్లలో ఇప్పటిదాకా నటించని తమ్మూ.. జీ కర్దా, లస్ట్ స్టోరీస్-2 వెబ్ సిరీస్‌ల్లో రెచ్చిపోయి నటించింది. వీటిలో తమన్నా చేసిన ఇంటిమేట్ సీన్లు, లిప్ లాక్స్ సోషల్ మీడియాను ఊపేశాయి. ఆమెకు కుర్రాళ్లు బాగా కనెక్ట్ అయిపోయారు. తమన్నా ఇంత హాట్‌గా కనిపించి.. సోషల్ మీడియాను ఊపేసిన నేపథ్యంలోనే ఆమెకు ఇప్పుడో పెద్ద సినిమాలో అవకాశం లభించినట్లు కనిపిస్తోంది.
హిందీలో జాన్ అబ్రహాం సరసన తమన్నా ఛాన్స్ అందుకుంది. ‘వేదా’ పేరుతో తెరకెక్కనున్న యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. కల్ హో న హో సహా హిందీలో చాలా పెద్ద సినిమాలు తీసిన నిఖిల్ అద్వాని ఈ చిత్రానికి దర్శకుడు. తమన్నా హిందీలో గతంలో ‘హిమ్మత్ వాలా’ సహా కొన్ని పేరున్న సినిమాల్లో నటించింది. కానీ అవన్నీ ఫ్లాప్ కావడంతో ఆమె కెరీర్ డౌన్ అయింది. ఇక బాలీవుడ్ మీద మళ్లీ ఆశలు లేని సమయంలో ఇప్పుడు ‘వేదా’లో అవకాశం వచ్చింది. ఇది ఆమెకు బాలీవుడ్లో లైఫ్ లైన్ అనే చెప్పాలి. తమ్మూ త్వరలోనే రజినీకాంత్ సినిమా ‘జైలర్’తో ప్రేక్షకులను పలకరించబోతోంది.
This post was last modified on July 14, 2023 3:59 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…